కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

కాళేశ్వరం మూడు బ్యారేజీలను పునరుద్దరణ పనులు తక్షణం చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేశాలు ఇచ్చారు. మరమ్మత్తు పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.

కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం మూడు బ్యారేజీలను పునరుద్దరణ పనులు తక్షణం చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేశాలు ఇచ్చారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అప్ర‌మ‌త్తం చేసి ప‌నుల్లో వేగం పెంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మూడు బ్యారేజీలను మరమ్మతుల అనంతరం వినియోగంలోకి తీసుకురావాల‌ని చెప్పారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా బ్యారేజీల మరమ్మతు ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని చెప్పారు.

సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్న‌ ప‌రీక్ష‌లు, న‌మూనాల సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని చెప్పారు. సీఎం సూచనల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.

కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేసి..నిర్ణీత గడువులోగా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలిచ్చారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా బ్యారేజీల మరమ్మతు ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని స్పష్టం చేశారు ఏఎఫ్ఆర్ వై ఇండియా, ఐఐటీ ముంబైకి డిజైన్ల బాధ్యతలు అప్పగించాలని, డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపాలని నిర్ణయించారు. మరమ్మత్తు పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.