Kerala | శబరిమల ఆలయంలో మహిళ మృతిపై హైకోర్టు ఆగ్రహం
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూలైన్‌లో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందింది. భారీ రద్దీ మధ్య ఏర్పాట్లు సరిపోలేదన్న అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
విధాత : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూలైన్‌లో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందింది. భారీ రద్దీ మధ్య ఏర్పాట్లు సరిపోలేదన్న అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు దేవస్థానం బోర్డును తీవ్రంగా మందలించింది. రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆరు నెలల ముందే ఏర్పాట్లు చేయవచ్చుగదా? ఎందుకు చేయలేదు? అని కోర్టు ప్రశ్నించింది. యాత్రికుల భద్రతపరంగా నిర్లక్ష్యం జరిగితే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే శుక్రవారం లోపు తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి నివేదిక సమర్పించాలని దేవస్థానం బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం అయింది. దీంతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తుతడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు నిలుచున్నారు.
ఈ క్రమంలో క్యూలైన్ల నుంచి తప్పించకుంటూ.. వాటిపై దూకి పరుగులు తీయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా తీవ్ర రద్దీ నెలకొన్నది. క్యూలైన్ లో ఉన్న కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ 58 ఏళ్ల మహిళ స్పృహ తప్పిపడిపోయి మరణించింది. ఈ క్రమంలో శబరిమలలో భక్తుల కోసం ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram