Komati Reddy : కన్ఫ్యూజన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కోసం రక్తం మరిగే కవితకు.. హరీష్ రావును తిడితే ఎందుకు కోపం రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
విధాత, హైదరాబాద్: కవిత కన్ఫ్యూజన్ లో ఉండి, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుందని రోడ్లుభవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత విమర్శిస్తుందన్నారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బిఆర్ఎస్ పుంజుకుంటుందని ఆమె అంటుందని, దీంతోకవిత బిఆర్ఎస్ లోనే ఉన్నదా అనే అనుమానం ఉందన్నారు. కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే…ఊరూరా తిరుగుతున్నావు.. మరి కేసీఆర్ ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తంమరిగిపోయిందని కవిత మాట్లాడారని అంటే కేటీఆర్, హరీష్ రావు లను ఉరితిసినా తప్పు లేదా….దీనికి కవిత సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావు ను తిడితే ఎందుకు రావడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం లో బిఆర్ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు. బిఆర్ఎస్ హాయాం లో నల్లగొండ మంత్రి జిల్లా కు చేసిన అన్యాయం పై కవిత ప్రశ్నించాలన్నారు.
నాకు నా తమ్మునికి మధ్య ఎలాంటి గొడవలు లేవు: మంత్రి కోమటిరెడ్డి
నాకు మా తమ్మునిరి మధ్య ఎటువంటి గొడవలు లేవని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదని చెప్పారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానన్నారు. సొంత రాష్ట్రంలోనే మంత్రి బాధ్యతలు తీసుకుంటా అని ఆనాడే చెప్పానన్నారు నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం ,ఆయనను ఏమన్నా అంటే ఖచ్చితంగా కౌంటర్ ఇస్తానని స్పష్టం చేశారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదన్నారు.
ఇవి కూడా చదవండి :
NTR | చేతబడి వల్లనే ఎన్టీఆర్‌కి ప్రమాదం.. స్టన్నింగ్ వ్యాఖ్యలు చేసిన కమెడీయన్
Revanth Reddy : మూసీ కారణంగా నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram