ప్రతి పక్షంలో కాంగ్రెస్ గెలిచినదానికంటే ఎక్కువే గెలిచాం : కేటీఆర్
ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచామని కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు, ఫార్ములా ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ గెలిచిన స్థానాలకంటే ఎక్కువగా మేం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాలుగు మున్సిపాల్టీలలో మాత్రమే గెలిచిందని, రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్ని గెలిచాడని, ఇప్పుడు మేము ఎన్ని గెలిచామన్నది చూడాలని, ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉంది అని, వాళ్ళు ఆశించినన్ని స్థానాలు రాలేదు అని కేటీఆర్ తెలిపారు. మా పార్టీ కార్యకర్తల గట్టి పోరాటం వలన, అద్భుతంగా పోరాటం వలన మంచి ఓటు బ్యాంకు సాధించామన్నారు. ఓవరాల్‌గా 30 మున్సిపాలిటీల పైగా వస్తాయి అనుకున్నామని, కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయన్నారు.
బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయి అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది, హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అని, పార్లమెంట్ ఎన్నికల్లో 17% ఓటు షేర్ నుంచి నేడు 30% ఓటు షేర్‌కి చేరుకున్నామని గుర్తుచేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు అని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక..వరుస కుంభకోణాలు బయటపడుతుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఫార్ములా ఈ కార్ రేసు కేసు అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తుందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదు అని, కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉంది అన్నారు. ఎన్ని సార్లు పిలిచినా పోతాము, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతాము అని, ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు, చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారు అన్నారు.
ఇవి కూడా చదవండి :
Kavitha : ఇది జస్ట్ ట్రైలర్ .. అసలు సినిమా ముందుంది: కవిత
Chiranjeevi | మెగా కవలల పేర్లపై చిరంజీవి ప్రశంసలు.. సంస్కృతి–ఆధ్యాత్మికత కలిసిన నామకరణం అంటూ హర్షం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram