వీళ్ల పాలన పాడుగాను.. బీపీ లేస్తుంది: కాంగ్రెస్ పాలనపై కూనంనేని ఫైర్

కాంగ్రెస్ పాలనపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలతో కూటమిలో విభేదాలు వెల్లడి కాగా తెలంగాణ రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Kunamneni Sambasiva rao

విధాత: కేరళం అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మధ్య మిత్ర బేధం రగిలిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ తరపున ప్రచారానికి వెళ్లి అక్కడ అధికార కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ పై విమర్శలు చేశారు. కేరళంలోని అధికార సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన విమర్శలు చేశారు.

అంతేకాకుండా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అంటూ విమర్శించారు. ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు కూల్చివేతను తప్పుబడుతూ గతంలో తన ప్రభుత్వంపై పినరయి విజయన్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతికారం తీర్చుకున్నట్లుగా ఆయన విమర్శలు కనినిపించాయి.

మా అడ్డాలో మమ్నల్ని తిడుతావా..రేవంత్ పై లేచిన కొడవళ్లు

కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళంకి వెళ్లి తమను అన్నేసి మాటలంటుంటే ఎర్రదండు రగిలిపోయింది. నువ్వక్కడంటే మేం ఇక్కడంటాం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై కమ్యూనిస్టులు విమర్శల కొడవళ్లు నూరుతున్నారు. ముందుగా మా సీఎం పినరయి విజయన్ ను విమర్శిస్తారా ? అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కన్నెర్ర చేశారు. రేవంత్ పరిపాలన తీరు..ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై విమర్శల దాడి చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ పార్టీ మాత్రం మిత్ర ధర్మాన్ని గుర్తు చేస్తూ ఇండియా కూటమి ఐక్యతను విచ్చిన్నం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడింది. తాజాగా కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, సీపీఐ మధ్య మాటల మంటలను మరింత రగిలించాయి.

కాంగ్రెస్ పాలన పై కూనంనేని ఆగ్రహం

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల ప్రభుత్వంపై విమర్శలు చేసిన గంటల్లోనే మిత్ర పక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎదురుదాడికి దిగారు. కొత్తగూడెం బస్టాండ్‌లో జరిగిన ప్రజాపాలన- ప్రగతి నివేదిక 99 రోజులు కార్యక్రమానికి హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం బస్టాండ్ చూస్తుంటే.. ‘వీళ్ల పరిపాలన.. వీళ్లు పాడుగాను, బీపీ లేస్తుంది..తిట్టలేక ఆడాళ్లు అన్నట్లుగా ఈ మాట అనాల్సి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివి,పట్టుదల, దీక్ష ఉండాలన.. వీళ్లకు అది లేదు అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

నేనైతే ఏడాదిలోగా బస్టాండ్ స్వరూపాన్ని మార్చేవాడనని..ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు పోరాటం చేద్దాం అన్నారు. రాష్ట్రంలోని 143 బస్టాండ్ ల అభివృద్దికి రూ.5కోట్ల చొప్పున 700కోట్లు కేటాయించినా అవి మెరుగుపడేవన్నారు. వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఆ నిధులు పెద్ద సమస్య కాదంటూ చురకలేశారు.

 

ఇవి కూడా చదవండి :

యుద్దం ఎఫెక్ట్.. నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ !
Niharika | ‘రాకాస’తో నిహారిక మరో ప్రయత్నం .. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్, థియేట‌ర్స్‌లో మెగా సంద‌డి

Latest News