Minister Thummala | పత్తిలో తేమ 12 శాతం మించకూడదు.. రైతులకు మంత్రి తుమ్మల సూచన

పత్తి రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్మకానికి తీసుకురావడానికి ముందు పత్తి తేమ శాతం 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు సూచించారు. తేమ 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదన్నారు.

Minister Thummala | పత్తిలో తేమ 12 శాతం మించకూడదు.. రైతులకు మంత్రి తుమ్మల సూచన

విధాత :

పత్తి రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్మకానికి తీసుకురావడానికి ముందు పత్తి తేమ శాతం 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు సూచించారు. తేమ 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదన్నారు. కాబట్టి మార్కెట్ యార్డు లేదా జిన్నింగ్ మిల్లులకు రాకముందే తేమ శాతాన్ని సరిచూసుకోవాలని మంత్రి కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా పత్తి పంటను కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఔళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్ లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు గరిష్ట మద్ధతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు పత్తి రైతులు తేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటిస్తుంటారని, ఏఈఓలు, మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని మంత్రి తుమ్మల తెలియజేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించవలసిందిగా కోరారు. అదేవిధంగా రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 ని మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిందని, రైతులకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా ఈ నెంబర్ ను వెంటనే సంప్రదించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు.