హెచ్ ఎండీఏ అనుమతులకు మున్సిపాలిటీలు ఎన్ ఓసీలు ఇచ్చే అధికారం ఇవ్వాలంటున్న రంగారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్లు
హైడ్రా కూల్చివేతలు వంద శాతం కరెక్ట్ అని మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలకు చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా నిర్ణయం వంద శాతం సరైందన్నారు.

హెచ్ ఎండీ ఏ ఇచ్చే అనుమతులన్నింటికీ ఎన్ ఓసీ(NOC) జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకే ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మెన్ల ఉమ్మడి సమావేశం జరిగింది. గత బీఆరెస్(BRS) ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలకు తెలిపారు. స్థానిక సంస్థలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. EECL ను మొత్తము రద్దు చేయాలన్నారు. కనీస మరమత్తులు కూడా చేయడం లేదని వారు ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు.
జలమండలి(HMWSSB) వాటర్ సప్లై ట్యాప్ లను మునిసిపల్ పరిధిలో ఉన్న అన్ని పాత ట్యాప్ కనెక్షన్ లను రెగ్యులరైజ్ (పున:రుద్దరణ) చేసి కొత్త నల్లాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్నికోరారు. మునిసిపల్ ప్రస్తుత జనాభాకు అనుగుణముగా సిబ్బందిని నియమించు కోనుటకు అనుమతించాలని కోరారు.
హైడ్రా వంద శాతం కరెక్ట్ అంటున్న మున్సిపల్ చైర్మన్లు
హైడ్రా కూల్చివేతలు వంద శాతం కరెక్ట్ అని మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలకు చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా నిర్ణయం వంద శాతం సరైందన్నారు.. హైడ్రా సంస్థ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. హైడ్రా ఈ దూకుడు కొనసాగించాలని సీఎంకు తెలిపారు. మున్సిపల్ చైర్మన్లు ప్రభుత్వం వద్ద పెట్టిన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, వీర్లలపల్లి శంకర్, కాలే యాదయ్య, మల్ రెడ్డి రాం రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీమతి మల్ రెడ్డి అనురాధ రెడ్డి , తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పారిజాత నరసింహ రెడ్డి, బడంగ్ పెట్ కార్పోరేషన్ మేయర్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి, శంషాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్, స్రవంతి, ఇబ్రహీం పట్నం మునిసిపల్ చైర్ పర్సన్ నరేందర్, షాద్ నగర్, ఆమనగల్ మునిసిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.