Neha Dhupia | పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ .. అదే మాకు క‌లిసి వ‌చ్చిందంటున్న బాలీవుడ్ భామ‌

Neha Dhupia | బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ తన ప్రేమ కథ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కమెడియన్ భారతి సింగ్ , ఆమె భర్త హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అంగద్, తన భార్య నేహా ధూపియాతో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని వివరించారు.

Neha Dhupia | బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ తన ప్రేమ కథ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కమెడియన్ భారతి సింగ్ , ఆమె భర్త హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అంగద్, తన భార్య నేహా ధూపియాతో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని వివరించారు.

అంగద్ బేడీ తెలిపిన వివరాల ప్రకారం, తాను నేహా ధూపియాను దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమించాడట. “నేను 8 ఏళ్లు ఆమె వెంటపడ్డాను. ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఆమె ఎప్పుడూ ఓకే చెప్పలేదు. ఆమె పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టేది” అని అంగద్ చెప్పాడు. ఈ వన్‌సైడ్ లవ్ చాలా కాలం పాటు కొనసాగిందని ఆయన వెల్లడించాడు.

ర‌న్నింగ్ స్టైల్ చూసి ప్రేమ‌లో..

నేహాను మొదటిసారి చూసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, “ఆమె ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతోంది. నేను వెనుక నిలబడి చూసి ‘వావ్, ఎంత మంచి ఫామ్’ అనుకున్నాను. ఆమె రన్నింగ్ స్టైల్‌నే చూసి ప్రేమలో పడ్డాను” అంటూ అంగద్ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు.

ఇక మరోవైపు నేహా ధూపియా తన దృష్టి అంతా కెరీర్‌పైనే పెట్టినట్టు వెల్లడించింది. “నా రోజంతా పని, వ్యాయామం, షూటింగ్స్‌తోనే గడిచేది. దారిలో ఎవరైనా ఆసక్తికరమైన వ్యక్తి ఎదురైతే బాగానే అనిపించేది, కానీ నా ఫోకస్ మాత్రం కెరీర్‌పైనే ఉండేది” అని నేహా తెలిపింది. అందుకే అంగద్ చేసిన ప్రయత్నాలు చాలా కాలం ఫలించలేదని చెప్పింది.

ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ఆమెతో సినిమాలు..

నేహాకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ఆమెతో కలిసి ఒక సినిమా కూడా చేశానని అంగద్ సరదాగా తెలిపాడు. “ఆమె కథ చెప్పకుండానే సినిమా చేయమంది, నేను ఒప్పుకున్నాను. షూటింగ్‌లో ఆమెతో ఎక్కువ సమయం గడపాలని అనుకున్నా, ఆమె అమ్మ కూడా అక్కడే ఉండేది. దీంతో నేను ఆమె అమ్మతోనే ఎక్కువగా మాట్లాడేవాడిని” అంటూ నవ్వుతూ చెప్పాడు.

ఇక వారి ప్రేమకథలో కీలక మలుపు నేహా గర్భవతి అయిన తర్వాతే వచ్చింది. “నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసిన తర్వాత మా జీవితంలో మార్పు వచ్చింది. మేము వెతుకుతున్న ప్రేమ మన దగ్గరే ఉందని అర్థమైంది” అని నేహా చెప్పింది. “మా కూతురే మమ్మల్ని కలిపింది” అని కూడా ఆమె పేర్కొంది.

చివరగా, ఈ జంట 2018 మే 10న గురుద్వారాలో సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలలకే వారికి కూతురు మెహర్ జన్మించింది. అనంతరం 2021లో కొడుకు గురిక్ పుట్టాడు. ప్రస్తుతం అంగద్ బేడీ – నేహా ధూపియా జంట తమ కుటుంబ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు.

Latest News