NTR| ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు తెలిస్తే అవాక్క‌వుతారు..!

NTR| ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు తెలిస్తే అవాక్క‌వుతారు..!

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆయ‌న మెయింటైనెన్స్ కూడా ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎన్టీఆర్ వాడే వ‌స్తువులు కూడా అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తున్నాయి. ఆయ‌న గ్యారేజ్‌లో ఖ‌రీదైన కార్లు చూస్తుంటే ఒక్కొక్క‌రికి మైండ్ బ్లాక్ అవుతుంటుంది. ఎన్టీఆర్ ఇటీవ‌లే మెర్సిడెజ్‌ బెంజ్‌ మే బ్యాక్‌ మోడల్‌ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.3.50 కోట్ల వరకు ఉంటుంది. కార్లు, వాచీలంటే అమితంగా ఇష్టపడే ఎన్‌టీఆర్‌ వాటి కొనుగోలుపై ఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ దేవ‌ర సినిమా షూటింగ్‌తో కొన్నాళ్లుగా బిజీగా ఉన్నారు. ఆయ‌న మూవీ షూటింగ్‌తో అంత బిజీగా ఉన్నా కూడా ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బిగ్గెస్ట్ హిట్టుగా నిల‌వ‌డంతో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కి ఎన్టీఆర్ ఫార్మల్ డ్రెస్సులో చాలా సింపుల్ గా వచ్చిన కూడా ఆయ‌న ధ‌రించిన వాచి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఆ వాచ్ చాలా రిచ్‌గా క‌నిపించ‌గా, దాని ధ‌ర ఎంతో తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో అద ‘Audemars Piguet Royal Oak Offshore’ మోడల్ వాచ్ అని, దాని ధర అక్షరాలా రూ.16,232,657 కనిపెట్టేసారు. వామ్మో ఎన్టీఆర్ వాచ్ ధ‌ర 16 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉందా అని ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్లపెడుతున్నారు.

ఎన్టీఆర్ ఇప్పుడే కాదు గ‌తంలో కూడా ఇలాంటి కాస్ట్‌లీ వ‌స్తువులు ధ‌రించి హాట్ టాపిక్‌గా మారడం మ‌నం చూశాం. ఇక ఎన్టీఆర్ దేవ‌ర విష‌యానికి వ‌స్తే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవ‌ర ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ హిందీలో రూపొందుతున్న వార్ 2లో నటిస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.