Deputy CM Pawan Kalyan| కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఏపీలోని చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్నిడిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివారం ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ఏనుగులకు ఆహారం అందించారు.

Deputy CM Pawan Kalyan| కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

అమరావతి : ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా(Chittoor District)లో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని(Kumki Elephant Center)డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌( Deputy CM Pawan Kalyan)ఆదివారం ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగు(Musalimadugu)లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ఏనుగులకు ఆహారం అందించారు.

కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్‌ కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్‌ కల్యాణ్‌ తిలకించారు. వాటికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీలో అడవీ ఏనుగుల బెడదను ఎదుర్కొనేందుకు ఈ కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.