Prabahs-Anushka|బాబోయ్.. అంత హైట్, ఫిజిక్ ఉన్న ప్ర‌భాస్‌ని అనుష్క నిజంగానే ఎత్తేసిందా..!

Prabahs-Anushka| టాలీవుడ్ క్యూటెస్ట్ పెయిర్స్‌లో ప్ర‌భాస్, అనుష్క శెట్టి జంట ఒక‌టి. వీరిద్ద‌రు క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే వారి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూ

  • Publish Date - April 17, 2024 / 12:54 PM IST

Prabahs-Anushka| టాలీవుడ్ క్యూటెస్ట్ పెయిర్స్‌లో ప్ర‌భాస్, అనుష్క శెట్టి జంట ఒక‌టి. వీరిద్ద‌రు క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే వారి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరి కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఏది ఏమైన అనుష్క‌, ప్ర‌భాస్ జోడికి మాత్రం మంచి క్రేజ్ ఉంది. అయితే వీరిద్ద‌రు కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన మిర్చి సినిమాలో ఎంత మ్యాజిక్ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

చిత్రంలో ప్ర‌భాస్‌కి మ‌ర‌ద‌లి పాత్ర‌లో అనుష్క న‌టించి అల‌రించింది. ప్ర‌భాస్ విదేశాల నుండి రాగా, ఆయ‌న త‌న బావ అని తెలుసుకున్న అనుష్క అన్నీ తానై చూసుకుంటూ తెగ సంద‌డి చేస్తుంటుంది. ఓ సారి మామిడి తోట‌కి తీసుకెళ్ల‌గా, అక్క‌డ మామిడి కాయలు కోయాల్సి ఉంటుంది. అయితే అవి అంద‌క‌పోవ‌డంతో అనుష్క‌ని ఎత్తుకొని తెంపే ప్ర‌య‌త్నం ప్ర‌భాస్ చేయ‌డు. కాని అనుష్కనే ధైర్యం చేస్తుంది. ఏకంగా ప్రభాస్‌ని ఎత్తుకుంటుంది. ఆ సీన్‌ మూవీకే హైలైట్ అని చెప్పాలి. ఆ సీన్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ మూములుగా ఉండ‌దు. ప్ర‌భాస్ వంటి భారీ క‌టౌట్‌ని అనుష్క అలా ఎలా ఎత్తింద‌నే చర్చ ఇప్ప‌టికీ న‌డుస్తూనే ఉంటుంది.

అయితే మిర్చి టీమ్‌ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ విషయంకి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. త‌న‌ని అనుష్క నిజంగానే ఎత్తుకుంది కాని అక్క‌డ ఒక చిన్న ట్రిక్ ఉప‌యోగించారు. ఫస్ట్ చిన్న కుర్చీ వేశారట. దానిపై తాను నిల్చోగా, అప్పుడు అనుష్కని తనని అలా గట్టిగా పట్టుకుందట. వెంటనే ఆ కుర్చీతీసేస‌య‌డంతో ఆ గ్యాప్‌లో షూట్‌ చేశారు. అయితే ఆమె అలా త‌న‌ని కాసేపు ఎత్తకుని మ్యానేజ్‌ చేసిందని, కానీ అది పెద్ద రిస్కే, నా లాంటి వాళ్ల‌ని అలా ఎత్తడం సేఫ్‌ కాదు, కానీ అనుష్క కష్టపడిందని ప్ర‌శంస‌లు కురిపించాడు ప్ర‌భాస్. అయితే ఈ ఐడియా ముందు త‌న‌కు చెప్పిన‌ప్పుడు కొత్త‌గా అనిపించింద‌ట‌. అంద‌రు హీరోయిన్స్‌ని ఎత్తుతుంటారు. కాని ఇక్క‌డ హీరోయిన్‌.. హీరోని ఎత్త‌డం కొత్త‌గా ఉంద‌నిపించింద‌ని ప్ర‌భాస్ ఓ ఇంటర్వ్యూలో తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క్లిప్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Latest News