Bihar Elections | ఢిల్లీలో ఓటు హక్కు ఉన్న వాళ్లు బీహార్‌లో ఓటు వేశారు.. బీజేపీపై రాహుల్ ఆరోపణలు
బీహార్ రెండో విడత పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత శుక్రవారం బీహార్ లో పలు చోట్ల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాగల్ పూర్ లో నిర్వహించన ర్యాలీలో ప్రసంగించిన ఆయన బీజేపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
బీహార్ :
బీహార్ రెండో విడత పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత శుక్రవారం బీహార్ లో పలు చోట్ల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాగల్ పూర్ లో నిర్వహించన ర్యాలీలో ప్రసంగించిన ఆయన బీజేపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఓటేసిన బీజేపీ నాయకులు.. బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేశారని తెలిపారు. కొందరు బీజేపీ నాయకులు ఉత్తరప్రదేశ్ లో ఉంటూ అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు హర్యానాలో కూడా ఓటు వేసినట్లు తనకు తెలిసిందని రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, ఈ విషయంపై గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ నాయకులపై ఆరోపణలు గుప్పించింది.
బీజేపీ నాయకుడు రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా, ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రెసిడెంట్ సంతోష్ ఓజా లు ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. అలాగే, ఈ నెల 6న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను సిన్హా, ఓజా తోసిపుచ్చారు. అలాగే, నవంబర్ 5 న బంకా ర్యాలీలో హర్యాణాలో జరిగిన ఓటు చోరి అంశంపై ఆధారాలు చూపించినట్లు రాహుల్ గుర్తు చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హర్యాణా ఎన్నికల్లో 2 కోట్ల ఓట్లలో 29 లక్షల ఓట్లు నకిలివి అని చెప్పారు. బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హర్యానాలో ఓట్ చోరీగి పాల్పడినట్లే ఇప్పుడు బీహార్ లోనూ అదే తంతును కొనసాగిస్తోందని ఆరోపించారు. దీన్ని బీహార్ ప్రజలు అనుమతించరని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి హర్యాణాలోని ఓటర్ల జాబితాను ఉదాహరించారు. ఒక బ్రెజిల్ మోడల్ ఫోటో ఓటర్ల లిస్టులో 22 సార్లు పునరావృతమవుతాయని, ఒక బూత్‌లో ఒక మహిళ 200 సార్లు ఓటు వేయగలదని ఆయన ఆరోపించారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలివిడత ముగియగా.. ఈ నెల 11వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 14న వెలువడనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram