విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
Free Movie | చిన్న సినిమాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించిన ఈ గ్రామీణ నేపథ్య ప్రేమకథ, వసూళ్ల పరంగా నిర్మాతలకు భారీ లాభాలు అందిస్తోంది. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Free Movie | చిన్న సినిమాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించిన ఈ గ్రామీణ నేపథ్య ప్రేమకథ, వసూళ్ల పరంగా నిర్మాతలకు భారీ లాభాలు అందిస్తోంది. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రేడ్ వర్గాల ప్రకారం మొత్తం బడ్జెట్: ₹3 కోట్లు (నిర్మాణం + నటీనటుల రెమ్యునరేషన్ + ప్రచార ఖర్చులు)
చిన్న సినిమాగా విడుదలై భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా చిత్ర నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాని మహిళలు ఉచితంగా చూసే అవకాశం కల్పించాడు. ఆందధ్రప్రదేశ్‌లోని కొన్ని ఫేమస్ థియేటర్స్‌లో ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు. మీరు థియేటర్ దగ్గరకి వెళితే మహిళలకి ఉచితంగా టికెట్ అందిస్తారని ఆయన చెప్పారు. అయితే ఈ ఆఫర్ నేడు ఒక్క రోజు మాత్రమే. టిక్కెట్స్ ఉచితంగా ఇచ్చే థియేటర్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఏపీ మహిళలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి.
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ స్టోరీని.. రాజు వెడ్స్ రాంబాయి చిత్ర రూపంలో సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చి ఆడియెన్స్‌ను అలరించారు మేకర్స్. సోషల్ మీడియాల నుంచి.. వెబ్ సైట్‌లలో రివ్యూల వరకు ఎక్కడ చూసిన కూడా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కేవలం మౌత్ టాక్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
థియేటర్స్ లిస్ట్..
విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత, మానస
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
కర్నూలు: ఆనంద్
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: SV సినీ మాక్స్