The Girl Friend Movie| రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రోమాంటిక్ పోస్టర్

The Girl Friend Movie| రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రోమాంటిక్ పోస్టర్

విధాత: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girl Friend Movie), మూవీ నుంచి ఆదివారం ఓ రొమాంటిక్ పోస్టర్(Romantic Poster)ను విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రెండో సింగిల్ ను ఈ నెల 26న విడుదు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty)-రష్మిక(Rashmika) లతో కూడిన రోమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు.

పుష్ప 1,2తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ‘యానిమల్‌’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. సల్మాన్‌ ఖాన్‌తో ‘సికందర్‌’ మూవీ నిరాశ పరిచినా ఇటీవలే నాగార్జున, ధనుష్‌ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో మళ్లీ మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ మూవీలు `ది గర్ల్ ఫ్రెండ్‌`. `ఆడవాళ్లు మీకు జోహార్లు`, అయుష్మాన్ ఖురానతో కలిసి థామా, తెలుగులో మైసా వంటి చిత్రాలతో పలు భాషా ప్రేక్షకులను అలరించబోతుండటం విశేషం.