Ravi Teja: ర‌వితేజ 75వ సినిమా అప్‌డేట్ మాములుగా లేదు.. ఈ సారి తెలంగాణ స్లాంగ్‌తో..!

Ravi Teja: ర‌వితేజ 75వ సినిమా అప్‌డేట్ మాములుగా లేదు.. ఈ సారి తెలంగాణ స్లాంగ్‌తో..!

Ravi Teja: మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చిన ర‌వితేజ మంచి మంచి సినిమాలని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవ‌లి కాలంలో రవితేజ హిట్ కొట్టిన సంద‌ర్భాలు లేవు. హిట్ రాక చాలా కాలం అయింది.డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూనే వాటిని చాలా స్పీడ్‌గా పూర్తి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం `మిస్టర్ బచ్చన్` సినిమా చేస్తున్న మాస్‌ మహారాజా ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తాడ‌ని భావిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇక ఈ రోజు ఉగాది పండుగ‌ని పుర‌స్క‌రించుకొని ర‌వితేజ కొత్త మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.

సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది. ర‌వితేజ 75వ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. పోస్టర్‌లో రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. `రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి`, `హ్యాపీ ఉగాది రా భయ్` అని తెలంగాణ యాసలో రాయడం చూస్తుంటే ఈ మూవీ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ మూవీలో ర‌వితేజ పాత్ర పేరు ల‌క్ష్మ‌ణ భేరి కాగా, ఇందులో ఆయ‌న పాత్ర ఎలా ఉంటుంద‌నేది ఉగాది పంచాంగం రూపంలో తెలియ‌జేశారు.

`ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో` అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్ట‌ర్ ద్వారా చెప్పుకు రావ‌డం విశేషం. చూస్తుంటే ఈ సినిమా చాలా కొత్త‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి పాపుల‌ర్ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం “ధూమ్ ధామ్ మాస్” దావత్ అంటూ తెలియ‌జేశారు. సంక్రాంతి బ‌రిలో మూవీ వ‌స్తుంద‌ని అంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఈ సినిమాతో ర‌వితేజ పెద్ద హిట్ కొట్టాల‌ని ప్ర‌తి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు.