Robinhood: శ్రీలీలతో.. వేర్ ఎవ‌ర్ యూ గో అంటున్న నితిన్‌

Robinhood: శ్రీలీలతో.. వేర్ ఎవ‌ర్ యూ గో అంటున్న నితిన్‌

నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి వేర్ ఎవ‌ర్ యూ గో (WhereverYouGo) అంటూ సాగే మ‌రో పాట‌ను విడుద‌ల చేశారు.

కృష్ణ‌కాంత్ (Krishnakanth) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా ఆర్మాన్ మాలిక్ (Armaan Malik) ఆల‌పించారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించాడు. ఈ పాట‌ను గ‌మ‌నిస్తే ద‌శాబ్దం క్రింద‌ట టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చిన ప్ర‌ముఖ అడ్వ‌ర్టైజ్‌మెంట్ల‌ను ఉద‌హ‌రిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.