Delhi Blast | ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది మృతి చెందారు. కారు పేలుడును కేంద్రప్రభుత్వం ఉగ్రదాడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Delhi Blast | ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

న్యూ ఢిల్లీ:

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది మృతి చెందారు. కారు పేలుడును కేంద్రప్రభుత్వం ఉగ్రదాడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారిస్తున్నాయి. కాగా, ఉగ్రవాదులు రచించిన భారీ కుట్రపై దర్యాప్తు సంస్థలు మరిన్ని కీలక విషయాలను బయటపెట్టాయి. డిసెంబర్‌ 6న ఢిల్లీలో సీరియల్‌ బ్లాస్ట్‌లు జరపాలని ఉగ్రవాదులు పన్నిన పథకం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో “ఉగ్ర డాక్టర్లు”గా గుర్తించిన కీలక వ్యక్తుల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు.

సీరియల్‌ బ్లాస్ట్‌కు మొత్తం 32 కార్లను సిద్ధం చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పేలుడు పదార్థాల రవాణా, బాంబుల అమరికకు ఈ కార్లను వినియోగించాలని ఉగ్రవాదుల ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు ఐ20, బ్రెజా, స్విఫ్ట్‌ డిజైర్‌, ఫోర్డ్‌, ఎకోస్పోర్ట్‌ మోడల్‌లకు చెందిన నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐ20 కారును పేలుడు కోసం ఉపయోగించినట్టు విచారణలో నిర్ధారణ అయింది. అయితే, పోలీసులను మోసం చేయడానికి ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌ రూపొందించారు. ఈ క్రమంలో తరచూ చేతులు మారిన పాత కార్లను మాత్రమే కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది.

వాహనాల యజమానుల హిస్టరీ గందరగోళంగా ఉండేలా పాత రిజిస్ట్రేషన్లు, దళారీల ద్వారా ట్రాన్సాక్షన్లు జరిగేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కార్లను వేర్వేరు ప్రాంతాల్లో నిలిపి ఉంచి, చివరి నిమిషంలో పేలుడు పదార్థాలను అమర్చేలా స్ట్రాటజీ రూపొందించినట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారం. నాలుగు కార్లు స్వాధీనం కావడం, బాంబుల కలెక్షన్‌, రవాణా నెట్‌వర్క్‌పై ఆధారాలు దొరకడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మిగిలిన కార్ల ట్రేసింగ్‌, సంబంధిత వ్యక్తుల మొబైల్‌ డేటా, ట్రావెల్‌ లాగ్స్‌ ఆధారంగా పోలీసులు మరిన్ని అరెస్టుల దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.