Silver, Gold prices| వెండి, బంగారం ధరల నిలకడ..రాగి, ప్లాటినం ఫైర్
వెండి, బంగారం ధరలు అదివారం సెలవు దినం పాటిస్తూ...ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. వెండి కిలో ధర రూ. 2,74,000వద్ద కొనసాగుతుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.1,41,220వద్ధ కొనసాగుతుంది. కాని రాగి, ప్లాటినం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.
విధాత : వెండి, బంగారం(Silver, Gold prices) ధరలు అదివారం సెలవు దినం పాటిస్తూ…ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. వెండి కిలో ధర రూ. 2,74,000వద్ద కొనసాగుతుంది. వెండి ధర నిలకడగా ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లేనని..మళ్లీ వేగంగా పెరుగుదల బాట పట్టి త్వరలోనే రూ.3లక్షలకు మార్క్ ను అందుకోనుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బంగారం ధరలు సైతం నిలకడగానే ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.1,41,220వద్ధ కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా వద్ద నిలకడగా ఉంది.
వెండి ధర డిసెంబర్ లోనే రూ.78వేల పెరుగుదల
డిసెంబర్ 1వ తేదీన కిలో వెండి ధర 1లక్ష96వేలు ఉండగా..ప్రస్తుతం ఏకంగా రూ.78,000పెరిగి రూ.2,74,000కు చేరడం గమనార్హం. నవంబర్ 1న రూ.1,66,000గా ఉండగా..ఆక్టోబర్ 1న 1,61,000గా ఉంది. సెప్టెంబర్ 1న రూ.1,36,000గా ఉండగా..ఆగస్టు 1న రూ.1,23,000గా ఉంది. జూలై 1న రూ.1,20,000గా ఉండగా..జూన్ 1న రూ.1,10,900గా ఉండటం గమనార్హం. 2025లో వెండి ధరలు 145శాతం పెరుగడం వెండి పరుగును సూచిస్తుంది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, డాలర్ విలువ ఆర్థిక హెచ్చుతగ్గులు,పెట్టుబడి సాధనంగా వెండిపై పెరుగుతున్న పెట్టుబడులు, వెండిడిమాండ్..ఉత్పత్తిల మధ్య లోటు, పారిశ్రామిక అవసరాల్లో వెండి వినియోగం వంటి అనేక అంశాలు వెండి ధరలను పైకి లేపుతున్నాయి.
రాగి(copper price) ధరలు రప్పారప్పా
బంగారం, వెండి ధరల పెరుగుదలతో షాక్ కు గురువుతున్న కొనుగోలు దారులకు రాగి ధరలు మరింత షాక్ నిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రాగి ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా టన్ను రాగి ధర సుమారు 12,000 డాలర్లను దాటింది. భారత్ లో ప్రస్తుతం కిలో రాగి ధర రూ.1,156వద్ద కొనసాగుతుంది. 2024జనవరిలో రూ.720వద్ద ఉన్న రాగి ధర 2025లో 35శాతం పెరిగి ప్రస్తుతం రూ.1,156కు చేరడం గమనార్హం. రాబోయే 18నెల్లలో రాగి ధరలు 50శాతం పెరుగవచ్చని..మూడేళ్ల నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యలో హెచ్చుతగ్గులకు గురైనప్పటికి ఖచ్చితంగా రాగి ధరలు కూడా పెరుగుదల బాటలో సాగుతాయని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాగి గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ పరికరాలలో వినియోగం, పవర్ గ్రిడ్లు విస్తరణలో, రక్షణ రంగంలో పెరిగిన వినియోగంతో రాగి ధరలు పైపైకి వెలుతున్నాయి. డాలర్ విలువ, ఆర్థిక వ్యవస్థ మార్పులు, ద్రవ్యోల్బణం కూడా రాగి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్లాటినం (platinum price)ధరలు పైపైకే
బంగారం, వెండి ధరలకు తోడుగా ప్లాటినం ధర ఆల్‌టైమ్ రికార్డులతో దూసుకపోతుంది. ఈ ఏడాది భారతదేశంలో ప్లాటినం ధరలు ఏకంగా 125 శాతం పెరిగింది. 10గ్రాముల ప్లాటినం ధర ఆదివారం రూ.1,790పెరిగి రూ. 70,740కి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ప్లాటినంపై పెట్టుబడులకు ఆక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్లాటినం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిసెబర్ 18న ప్లాటినం ధర 10గ్రాముల ధర రూ.56,880గా ఉంది. జూన్ 1న రూ.28,920గా ఉండటం చూస్తే ప్లాటినం ధరల పెరుగుదల వేగం అర్ధమవుతుంది. ప్లాటినం ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram