విధాత: అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము.. మైదానంలో శిక్షణలో ఉన్న పోలీసు సిబ్బంది సీరియస్ గా పరేడ్ చేస్తున్న సమయంలో వారి మధ్య దూరింది. ఇంకేముంది ట్రైనీ పోలీసులు పాము దెబ్బకు చేస్తున్న పరేడ్ ను వదిలేసి తలో దిక్కు పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కేరళ-తిరువనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో ట్రైనీ పోలీసులు పరేడ్ చేస్తున్న సమయంలో వారి మధ్య అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. పరేడ్ లో మార్చ్ చేస్తున్న సిబ్బంది తమ కాళ్ల మధ్య దూరిన పామును చూసి భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ పాము వారి హడావుడితో మరింత వేగంగా ప్రయాణిస్తూ ఓ కారు కింద దూరింది. ఈ వీడియో నెట్టింటా వైరల్ కాగా…ట్రైనీ పోలీసులకు భద్రతాపరమైన ట్రైనింగ్ తో పాటు వన్యప్రాణులను హ్యాండలింగ్ చేసే శిక్షణ కూడా ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
கேரள மாநிலம் திருவனந்தபுரத்தில் உள்ள காவல் பயிற்சி கல்லூரியில் (#Police_Training_College), காவலர்களுக்கான பயிற்சி வகுப்பு நடைபெற்றுக் கொண்டிருந்தபோது சாரைப்பாம்பு (#Ptyasmucosa) ஒன்று உள்ளே புகுந்த வீடியோ தற்போது இணையதளத்தில் வைரலாகி வருகிறது. #Kerala #Thiruvananthapuram pic.twitter.com/kTbRYBWEPZ
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) April 28, 2026
