యూపీఎస్ వ‌ద్దు.. పాత పెన్షన్ విధానమే కావాలి : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

సీపీఎస్ స్థానంలో యూపీఎస్ పెన్షన్ విధానాన్ని తీసుకు వ‌స్తామ‌ని కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించ‌డాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సీపీఎస్‌, యూపీఎస్ రెండు పెన్షన్ విధానాలు వ‌ద్దేవ‌ద్దన్నారు. పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకు రావాల‌ని డిమాండ్ చేశారు.

యూపీఎస్ వ‌ద్దు.. పాత పెన్షన్ విధానమే కావాలి :  తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
  • సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు
  • ఉద్యోగ సంఘాల‌ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

కేంద్ర ప్రభుత్వం(central government’s) సీపీఎస్ స్థానంలో యూపీఎస్ పెన్షన్ విధానాన్ని తీసుకు వ‌స్తామ‌ని ప్రక‌టించ‌డాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సీపీఎస్‌, యూపీఎస్ రెండు పెన్షన్ విధానాలు వ‌ద్దేవ‌ద్దన్నారు. పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకు రావాల‌ని డిమాండ్ చేశారు.

శుక్రవారం న‌గ‌రంలో వివిధ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కుల‌(various employers’ and teachers’ associations)తో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ(జేఏసీ) స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో జేఏసీ భ‌విష్యత్తు కార్యాచ‌ర‌ణ‌, విస్తర‌ణ‌, త‌దిత‌ర అంశాల‌పై చర్చ జరిగింది. ఈ  స‌మావేశంలో చైర్మన్  వి.ల‌చ్చిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబ‌రు 1 నుంచి 5 వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల‌లోని అన్ని శాఖ‌ల్లోని ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక‌, పెన్షన‌ర్ల‌, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సంఘాల నాయ‌కుల‌తో ప్రత్యక్షంగా క‌లువ‌నున్నట్టు చెప్పారు.  జేఏసీ విస్తర‌ణ‌, భ‌విష్యత్తు కార్యాచ‌ర‌ణ‌, త‌దిత‌ర అంశాల‌పై స్థానిక ఉద్యోగ‌,  ఉపాధ్యాయ‌, మిగ‌తా సంఘాల నేత‌ల‌తో విస్రృతంగా చ‌ర్చిస్తామన్నారు.

పాత పెన్షన్ విధానానికై శనివారం ప్రజా భ‌వ‌న్‌కు

కొత్తగా కేంద్రం తెస్తామ‌న్న యూపీఎస్‌, ప్రస్తుతం రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సీపీఎస్ ఈ రెండు పెన్షన్ విధానాలు వ‌ద్దని.. పాత పెన్షన్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని కోరేందుకు జేఏసీ ప్రతినిధులు శ‌నివారం ఉద‌యం 9గంట‌ల‌కు ప్రజా భ‌వ‌న్‌కు వెళ్లి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌చేస్తామని లచ్చిరెడ్డి తెలిపారు.   ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయ‌కులు రాములు, కె.రామ‌కృష్ణ‌, గోపాల్‌, ర‌మాదేవి, ద‌ర్శన్‌గౌడ్‌, క‌త్తి జ‌నార్ధన్‌, ప్రగ‌తికుమార్‌, ఎస్‌.రాములు, సంప‌త్‌కుమార‌స్వామి, మేడి ర‌మ‌ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.