ఉద్యోగుల అందరి పక్షాన ఒక్క రోజు మూల వేతనం రూ.130 కోట్లు

కొంతమంది గత ప్రభుత్వం తో అంటకాగి జేఏసీ ఐక్యతను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని ఏలూరి శ్రీనివాస్ ఆరోపించారు.

ఉద్యోగుల అందరి పక్షాన ఒక్క రోజు మూల వేతనం రూ.130 కోట్లు

రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి తమ మూల వేతనం నుంచి ఒక్క రోజు వేతనం రూ.130 కోట్లు సీఎం సహాయ నిధికి ఇవ్వడానికి నిర్ణయించినట్లు ఉద్యోగుల జేఏసీ నాయకులు మార్గం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ TNGO భవన్ లో జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మానవతా దృక్పధంతో ఆలోచించి 205 సంఘాలం అందరం కలిసి ఉద్యగుల అందరి పక్షాన ఒకరోజు మూలవేతనాన్ని అనగా 130కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, నాలుగవ తరగతి ఉద్యోగులు అందరూ కూడా వారి వారి స్థాయిల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని తెలియజేసారు.

జేఏసీ స్టీరింగ్ కమిటీ తరపున రాష్ట్రంలోని అందరు ఉద్యోగుల పక్షాన 130కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం జరిగిందని ఏలూరి శ్రీనివాస్ చెప్పారు. తదనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితులనుండి బయటపడగానే సచివాలయంలో ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న సమస్యల పై చర్చించి నిర్ణయం తీసుకుందామని అనడం శుభపరిణామమన్నారు.

కొంతమంది గత ప్రభుత్వం తో అంటకాగి జేఏసీ ఐక్యతను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని ఏలూరి శ్రీనివాస్ ఆరోపించారు. TGEJAC అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 10లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిద్యం వహిస్తున్నదన్నారు. ఈ జేఏసీ లో ఏ నాయకులు కూడా స్వార్ధం కోసం పనిచేసేవారు లేరని, అందరు కూడా సేవకులే అని తెలియజేసారు. ఉదయం జరిగిన సమావేశంలో TNGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని, TGO ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, PRTU రాష్ట్ర అధ్యక్షులు పి. శ్రీపాల్ రెడ్డి, TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, STU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధానంద గౌడ్, ట్రెస్సా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతం కుమార్, నాలుగవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్, టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్,DTF ప్రధాన కార్యదర్శి లింగా రెడ్డి, గ్జలా రాష్ట్ర అధ్యక్షులు పి. మధుసూదన్ రెడ్డి, TPTU రాష్ట్ర అధ్యక్షులు రాధాకిషన్, TTU రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్ రెడ్డి, PRTUTG రాష్ట్ర అధ్యక్షులు పర్వతి సత్యనారాయణ, TRTF రాష్ట్ర అధ్యక్షులు రమేష్,పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. మధుసూదన్ రెడ్డి,TSUTF రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్,TNGO రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, TNGO మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, TGO జిల్లా అధ్యక్షులు రవి,TNGO భద్రాద్రి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమరనేని రామారావు, కంచర్ల సాయి భార్గవ్ చైతన్య, ట్రెసా జిల్లా అధ్యక్షులు భగవాన్ రెడ్డి,TGO భద్రాద్రి జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు సంఘం వెంకట పుల్లయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.