51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వండి.. ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ

సుధీర్ఘంగా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.

51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వండి.. ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ

పాత పెన్షన్ పునరుద్ధరించండి
ఉద్యోగులతో చర్చలు జరపండి
జేఏసీ సమావేశ వివరాలను వెల్లడించిన జేఏసీ చైర్మన్ మార్గం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు

సుధీర్ఘంగా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం సుంద‌ర‌య్య విజ్ఙాన కేంద్రంలో 205 భాగస్వామ్య సంఘాలతో జరిగిన సమావేశంలో 9 తీర్మానాలు చేసినట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జేఏసీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించామన్నారు. 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా రెండవ పీఆర్సీ నివేదిక తెప్పించుకొని పెరిగిన ధరల ప్రకారం 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వన్నా కోరారు. అలాగే పాత పెన్షన్ విధానం తీసుకు రావాలని సీపీ ఎస్ ను రద్దు చేయాలన్నారు. తక్షణంగా డీఏను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగుల జేఏసీ తీర్మానాలు ఇవే…

-01-07-2022 నుంచి పెండింగ్ లో ఉన్ అని డీఏలతో పుట కొత్తగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించే డీఏ కలిపి మొత్తం 5 డీఏలను వెంటనే విడుదల చే యాలి. బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి.

-పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి. అలాగే ఇ-కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ, ట్రెజరీ డిపార్ట్ మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్దరించి ఉద్యోగులకు చెల్లించాలి.

– అన్ని ఉద్యోగ సంఘాలతో ఇప్పటికే చర్యలు పూర్తయినందున ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్ మెంట్ తో పాటు రెండవ పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి.

– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈ హెచ్ ఎస్) అమలు చేయాలి.

-కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

-జీఓ317 ను సమీక్షించి ఈ జీవో బాధితుల బదిలీల కోసం ఉద్యోగులు కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా, వీలైనంత త్వరగా వెబ్ సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలి.

-ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల జే ఏసీ నాయకులను వెంటనే పిలిచి పరిష్కరించాలి.

– ఉద్యోగుల జేఏసీ జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు

– ఉద్యోగుల సమస్యల సాధాన కోసం భవిష్యత్ కార్యచరణ