Telangana High Court| పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు స్పష్టీకరణ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయినందునా..ఈ దశలో జోక్యం చేసుకోలేమని..స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Nov 28, 2025, 11:43 am IST
Read Time: 3 mins
Telangana High Court| పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు స్పష్టీకరణ

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) నిర్వహణపై లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి జోవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం హైకోర్టు(Telangana High Court) విచారించింది. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు.

అయితే పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయినందునా..ఈ దశలో జోక్యం చేసుకోలేమని..స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చిచెప్పింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపర అడ్డంకుల సమస్య తొలగిపోయింది. రాష్ట్రంలో డిసెంబర్ నెల 11,14,17తేదీలలో మూడు విడతలు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.