Jagitial | గుప్త నిధుల కోసం గుట్టుగా వెళ్లారు.. చివరికి ఏమైందంటే?
మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మి ముగ్గురు వ్యక్తులు తవ్వకాల కోసం వెళ్లారు. అక్కడ భారీ సైజులో మూడు వైపులా తవ్వారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
విధాత :
గుప్త నిధుల కోసం గుట్టుగా వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, అతడు విద్యుత్ షాక్ తో చనిపోయాడని మిగతా ముగ్గురు చెబుతున్నారు. కానీ, నరబలి కోసమే చంపేశారని మృతుడి కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో కండ్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవత అనే మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మి.. మొగిలి అనే వ్యక్తితో పాటు రాజేశ్, సోమయ్యలు నిధుల తవ్వకం అక్కడకు వెళ్లారు.
గుప్తనిధుల కోసం భారీ సైజులో గుంతలు తవ్వే క్రమంలో మొగిలి విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మొగిలి మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, మొగిలిని నరబలి ఇచ్చి.. కరెంట్ షాక్ అని అబద్దాలు చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి గుప్తి నిధుల కోసం మూడు వైపులా తవ్వకాలతో పాటు వివిధ రకాల పూజలకు సంబంధించిన పూజా సామాగ్రిని గుర్తించారు.
అయితే, గుప్త నిధులు తవ్వకాలు జరిపిన స్థలంలో విద్యుత్ తీగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో కరెంట్ షాక్ తో మొగిలి చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. కానీ, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం నరబలి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. దీంతో పూర్తి విచారణ చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల గుప్త నిధుల తవ్వకాల కోసం చాలా ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని చెబుతూ పలు ముఠాలు తమ కార్యక్రమాలు ఆపడం లేదు. ఎవరైనా గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తే నమ్మకుండా తమకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram