IPS | ముగ్గురు ఎస్‌పీఎస్ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు గా పదోన్నతి
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ లకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి దక్కింది. ఈ మేరకు యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ లుగా ప్రమోట్ అయిన విషయాన్ని తెలియజేసింది.
విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ లకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి దక్కింది. ఈ మేరకు యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ లుగా ప్రమోట్ అయిన విషయాన్ని తెలియజేసింది. వీరిలో ఎస్. శ్రీనివాస్, కే. గుణశేఖర్, డీ. సునీత లు ఉన్నారు.
గతంలో సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఎస్. శ్రీనివాస్ పని చేశారు. కాగా కన్ఫర్డ్ ఐపీఎస్ అంటే, రాష్ట్ర పోలీసు సర్వీసులో ఉన్న అధికారులకు ఐపీఎస్ ల గా పదోన్నది ఇవ్వడం. యూపీఎస్సీ ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి.. సమావేశమై అర్హత కలిగిన స్టేట్ పోలీస్ సర్వీసులకు చెందిన అధికారుల పేర్లను పరిశీలించి ఎంపిక చేస్తారు. పదోన్నతి పొందిన వారు ఐపీఎస్ అధికారులుగా గుర్తింపు పొందుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram