TVK Vijay| సర్’ నిలిపివేతకు సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ!
తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ను నిలిపివేయాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ : తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ను నిలిపివేయాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘సర్’ ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చీఫ్, సినీ నటుడు విజయ్(Vijay) ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అధికార డీఎంకే పార్టీ సైతం ఇప్పటికే సర్ కు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించింది. యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లో సర్ చేపట్టరాదంటూ మాజీ సీఎం అఖిలేష్ , బెంగాల్ సీఎం మమతలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. తాజాగా టీవీకే చీఫ్ విజయ్ కూడా సర్ కు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించడం విశేషం.
‘సర్’ పై విపక్షాల భయాందోళనలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలలో తప్పులను సరిచేయడానికి, దొంగ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహిస్తు వస్తుంది. ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్ రాష్ట్రంలో సర్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లో సర్ కారణంగా 68.66 లక్షల ఓటర్లను జాబితా నుండి తొలగించారు. బీహార్‌లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను దేశమంతా చేపట్టాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. అయితే బీహార్ లో సర్ ని ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సర్ కారణంనే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిదంటూ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఎన్డీఏ యేతర పార్టీలు సర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram