అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ల్యాడిల్ నుంచి హాట్‌మెంట్ బకెట్లు కుప్పకూలి పెద్దమొత్తంలో కార్మికులపై ద్రవం పడటంతో ప్రమాదం జరిగింది. ఉక్కు ద్రవం మీద పడటంతో ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించారు. 1,500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కుద్రవం లీకై ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి..
ఎస్‌ఎంఎస్-2 విభాగంలో వేడి ఉక్కు లీక్ కావడంతో ఒక్కసారిగా ఎగసిపడిన భారీ మంటలు..
ప్రమాదంలో మరికొంతమంది కార్మికులకు తీవ్ర గాయాలు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు..
ఘటనా స్థలానికి… pic.twitter.com/UIaXoKPTFK
— Telugu Stride (@TeluguStride) June 8, 2026
