విధాత: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగడ్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు వేరే వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రోధనలు మిన్నంటాయి. ఘటనపై స్థానికి ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రమాద సమయంలో మద్యం సేవించాడా లేదా అని వైద్య పరీక్షలు చేసేందుకు తీసుకువెళ్లామన్నారు. మద్యం సేవించడం మూలంగా ప్రమాదం జరిగిందా లేదా అన్న విషయంతో రిపోర్ట్ తయారు చేయాలన్నారు. అయితే బస్సు ఆరు సంవత్సరాల క్రితమే ఫిట్‌నెస్ కోల్పోయిందన్నారు. కాలపరిమితి లేని బస్సుని ఉపయోగించడంతో పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు.
హర్యానాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది విద్యార్థులు మృతి.. 20 మందికి గాయాలు
విధాత: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగడ్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు వేరే వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం […]
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు