Threads Vs Twitter | థ్రెడ్స్‌కు.. ట్విటర్ మధ్య..10 వ్యత్యాసాలు
Threads Vs Twitter | విధాత: కుస్తీ పోటీలకు కూడా సిద్ధమైన ఇద్దరు కార్పొరేట్ దిగ్గజ పోటీదారులు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకెన్ బర్గ్ (Mark Zuken Burg). ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దానిని క్యాష్ చేసుకునేందుకు అన్నట్లుగా జుకెన్ బర్గ్ ట్విటర్ కు పోటీగా థ్రెడ్స్ అనే సామాజిక మాధ్యమాన్ని తీసుకొచ్చారు. రెండూ అభిప్రాయాలు వెల్లడించుకునే వేదికలైనా వాటి […]

Threads Vs Twitter |
విధాత: కుస్తీ పోటీలకు కూడా సిద్ధమైన ఇద్దరు కార్పొరేట్ దిగ్గజ పోటీదారులు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకెన్ బర్గ్ (Mark Zuken Burg). ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం.
దానిని క్యాష్ చేసుకునేందుకు అన్నట్లుగా జుకెన్ బర్గ్ ట్విటర్ కు పోటీగా థ్రెడ్స్ అనే సామాజిక మాధ్యమాన్ని తీసుకొచ్చారు. రెండూ అభిప్రాయాలు వెల్లడించుకునే వేదికలైనా వాటి మధ్య కొన్ని తేడాలున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా..
- థ్రెడ్స్ (Threads)లో యూజర్ సమాచారాన్ని పంచుకోడానికి 500 పదాలను ఉపయోగించుకోవచ్చని దాని మాతృసంస్థ మెటా ప్రకటించింది. అదే ట్విటర్‌లో ఈ పరిమితి 280 పదాలు మాత్రమే. ఒక వేళ 8 డాలర్లు చెల్లిస్తే బ్లూ టిక్ ఇవ్వడమే కాకుండా పదాల పరిమితిని 25 వేలకు పెంచుతామని ట్విటర్ ప్రకటించి అమలు చేస్తోంది కూడా. అయితే మెటా ఇప్పటి వరకు డబ్బులిస్తే టిక్ మార్క్ ఇస్తామని చెప్పలేదు.
- థ్రెడ్స్‌లో ఎకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వ్యక్తులకు కచ్చితంగా ఇన్‌స్టా ఖాతా ఉండాల్సిదేనని మెటా (Meta) వెల్లడించింది. ఆ ఇన్‌స్టా ఖాతాలో ఉన్న ఫాలోవర్లు, స్నేహితులు నేరుగా థ్రెడ్స్‌లోకి బట్వాడా కావడంతో త్వరగా విస్తరించొచ్చనేది మెటా ఆలోచనగా కనిపిస్తోంది.
- వెరిఫైడ్ యూజర్లైనా.. అన్ వెరిఫైడ్ యూజర్లు అయినా 5 నిమిషాల వీడియోను థ్రెడ్స్‌లో పోస్టు చేసుకోవచ్చు. ట్విటర్ (Twitter) లో మాత్రం బ్లూ టిక్ లేని వారు 2 నిమిషాల 20 సెకన్ల వీడియోను మాత్రమే పోస్ట్ చేయగలరు
- కరెంట్ ట్రెండింగ్ ఈవెంట్స్‌ను తెలుసుకోవడంతో ట్విటర్ ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ట్విటర్ హోంపేజి చూస్తే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలిసిపోతుంది. మెటాలో ప్రస్తుతానికి ఆ సౌకర్యం లేదు. మనం అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్లడమే.
- బుధవారం విడుదలైన థ్రెడ్స్ వెర్షన్‌లో పోస్టులను సేవ్ చేసుకునే ఐచ్ఛికం ఉన్నట్లు కనపడలేదు.
ట్విటర్‌లో ఈ సౌకర్యం ఉంది. - పోస్టుల కింద చర్చలు వాదోపవాదాల పోస్టులను చూడటమూ రెండింటిలో వేరేలా ఉంది. థ్రెడ్స్‌లో దానికి మూడు సార్లు క్లిక్ చేయాల్సి ఉండగా.. ట్విటర్‌లో ఒక క్లిక్ చాలు. ప్రస్తుతం వీటి స్క్రీన్ షాట్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
- అలాగే మనం ఇతర యూజర్ల ఇష్టాఇష్టాలను చూడటానికి థ్రెడ్స్‌లో ప్రస్తుతం కుదరదు. ట్విటర్‌లో దానికి ప్రత్యేకంగా ఒక ట్యాబ్‌నే కేటాయించారు.
- చూస్తూ ఉంటే థ్రెడ్స్, ఇన్‌స్టా (Instagram)పేజ్ ఆర్కిటెక్చర్ ఒకలాగే ఉన్నట్లు అనిపిస్తోంది, అకౌంట్ బ్లాకింగ్, మ్యూటింగ్ అంతా ఒకటే. ఇది ఎంత మేర యువతను ఆకర్షిస్తుందో చూడాలి
- థ్రెడ్స్ ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటనలను తన ఫ్లాట్‌ఫాంలో అనుమతించడం లేదు. ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడానికి మెటా ఇప్పటికి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది.
- ఈ యాప్‌లో సంపాదించకున్న ఫాలోవర్లతో.. మరింత సమర్థవంతంగా సంభాషించొచ్చని థ్రెడ్స్ బాధ్యతలు చేస్తున్న మెటా వైస్ ప్రెసిడెంట్ కానర్ హేస్ ధీమా వ్యక్తం చేశారు. ట్విటర్, ఇన్‌స్టాలతో పోలిస్తే మరింత పెద్దవైన డిజిటల్ సమూహాలతో నెట్వర్క్‌ను ఏర్పరచుకోచ్చని వెల్లడించారు.