విధాత : హైదరాబాద్ బిర్యానీ..హాలీంలకు ఆహార ప్రియుల్లో ఉన్న క్రేజ్ కొత్తది కాదు.. ఇక పార్టీల్లోనైతే అయితే బిర్యానీ లేనిదే మెను ఉండదు. నూతన సంవత్సరం..రంజాన్ వంటి స్పెషల్ డేస్‌లలో బిర్యానీ ఆర్డర్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో రంజాన్ మాసంలో సైతం అదే జోరు కొనసాగింది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ దఫా రంజాన్ మాసంలో బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లుగా స్వీగ్గీ తెలిపింది. రంజాన్ మాసం మార్చి 11 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 10లక్షలకు పైగా బిర్యానీలను స్వీగ్గీలో ఆర్డర్ చేశారు. ఇక రంజాన్ స్పెషల్ వంటకం హలీంను 5.3లక్షలు ఆర్డర్ చేయడం గమనార్హం.