King Cobra | కోళ్ల గూట్లోకి దూరిన..13 అడుగుల గిరి నాగు..

King Cobra | విధాత: సాధార‌ణ పామును చూస్తేనే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌డుతాయి. అదే గిరినాగు క‌నిపిస్తే గుండె ఆగినంత ప‌ని అవుతుంది. 13 అడుగుల పొడ‌వున్న ఓ గిరినాగు అనకాప‌ల్లి జిల్లాలో క‌ల‌క‌లం సృష్టించింది. కోళ్ల గూట్లోకి దూరి స్థానికులను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అన‌కాప‌ల్లి జిల్లా ఎం.కోడూరు గ్రామానికి చెందిన రైతు ఎల‌మంచిలి ర‌మేశ్ త‌న పొలంలో కోళ్ల‌ను పెంచుకుంటున్నాడు. ఇందు కోసమ‌ని ఓ గూడును కూడా […]

King Cobra | కోళ్ల గూట్లోకి దూరిన..13 అడుగుల గిరి నాగు..

King Cobra |

విధాత: సాధార‌ణ పామును చూస్తేనే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌డుతాయి. అదే గిరినాగు క‌నిపిస్తే గుండె ఆగినంత ప‌ని అవుతుంది. 13 అడుగుల పొడ‌వున్న ఓ గిరినాగు అనకాప‌ల్లి జిల్లాలో క‌ల‌క‌లం సృష్టించింది. కోళ్ల గూట్లోకి దూరి స్థానికులను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అన‌కాప‌ల్లి జిల్లా ఎం.కోడూరు గ్రామానికి చెందిన రైతు ఎల‌మంచిలి ర‌మేశ్ త‌న పొలంలో కోళ్ల‌ను పెంచుకుంటున్నాడు. ఇందు కోసమ‌ని ఓ గూడును కూడా ఏర్పాటు చేశాడు. అయితే మంగ‌ళ‌వారం రోజు ఉన్నట్టుండి కోళ్ల‌న్నీ ఒకేసారి గ‌ట్టిగా అరుస్తుండడంతో ఏం జ‌రిగిందో అని కోళ్ల గూడు వ‌ద్ద‌కు వెళ్లి చూడగా రైతు గుండె ఆగినంత ప‌నైంది.

న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతున్న 13 అడుగుల గిరినాగును చూసి ర‌మేశ్ హ‌డ‌లిపోయాడు. వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్ వెంక‌టేశ్‌కు ర‌మేశ్ స‌మాచారం అందించగా పొలం వ‌ద్ద‌కు చేరుకున్న వెంక‌టేశ్ 20 నిమిషాలు తీవ్రంగా శ్ర‌మించి గిరినాగును ప‌ట్టుకున్నారు.

అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. గిరినాగును చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. గతంలో ఎప్పుడూ ఇంత పొడవైన పామును చూడలేదని స్థానికులు పేర్కొన్నారు.

అనకాపల్లి, మాడుగల, రంపచోడవరంతో పాటూ పలు ప్రాంతాల్లో తరచుగా ఈ కింగ్ కోబ్రాలు కనిపిస్తు న్నాయి. ఎక్కువ శాతం పొలాలతో పాటూ అడవికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఇక్కడ మాత్రం కోళ్ల గూడు ఉండటంతోనే అటు వైపుగా వచ్చినట్లు స్థానికులు తెలిపారు.