Meghalaya | 16 ఏళ్ల బాలిక శృంగారంపై నిర్ణ‌యం తీసుకోగ‌ల‌దు.. యువ‌కుడిపై పోక్సోను కొట్టేసిన హైకోర్టు

విధాత‌: మేఘాల‌యా (Meghalaya) హైకోర్టు సంచ‌ల‌నీ తీర్పు వెలువ‌రించింది. మైన‌ర్ అయిన‌ప్ప‌టికీ 16 ఏళ్ల బాలిక శృంగారంలో పాల్గొన‌లా వ‌ద్దా అనే దానిపై నిర్ణ‌యం తీసుకోల‌గ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. బాలిక ఒప్పుకొని శృంగారంలో పాల్గొన్నందున త‌న‌పై పెట్టిన పోక్సో కేసును కొట్టేయాల‌ని ఓ వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై జ‌స్టిస్ వ‌న్‌లురా దేయిన్‌దో ఏక‌స‌భ్య ధ‌ర్మాసనం విచార‌ణ జ‌రిపింది. కాగా.. బాలిక త‌న నివేదిక‌లో ఇద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని, ఇష్ట‌ప‌డే శృంగారంలో పాల్గొన్నామ‌ని చెప్ప‌డాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. 16 […]

  • Publish Date - June 25, 2023 / 09:33 AM IST

విధాత‌: మేఘాల‌యా (Meghalaya) హైకోర్టు సంచ‌ల‌నీ తీర్పు వెలువ‌రించింది. మైన‌ర్ అయిన‌ప్ప‌టికీ 16 ఏళ్ల బాలిక శృంగారంలో పాల్గొన‌లా వ‌ద్దా అనే దానిపై నిర్ణ‌యం తీసుకోల‌గ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. బాలిక ఒప్పుకొని శృంగారంలో పాల్గొన్నందున త‌న‌పై పెట్టిన పోక్సో కేసును కొట్టేయాల‌ని ఓ వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై జ‌స్టిస్ వ‌న్‌లురా దేయిన్‌దో ఏక‌స‌భ్య ధ‌ర్మాసనం విచార‌ణ జ‌రిపింది.

కాగా.. బాలిక త‌న నివేదిక‌లో ఇద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని, ఇష్ట‌ప‌డే శృంగారంలో పాల్గొన్నామ‌ని చెప్ప‌డాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. 16 ఏళ్ల బాలిక అన్నీ ఆలోచించే సెక్స్‌లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించుకుంది కాబ‌ట్టి పిటిష‌న్‌దారుపై పోక్సో కేసును కొట్టేస్తున్నామ‌ని, అత‌డిని వెంట‌నే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో ధ‌ర్మాస‌నం కొన్ని వ్యాఖ్య‌లు చేసింది. చూస్తుంటే పోక్సో చ‌ట్టాన్ని బాలిక‌ల త‌ల్లిదండ్రులు కావాల‌ని వేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌ని పేర్కొంది. శృంగార ప‌ర‌మైన బంధాల్లో ఉన్న త‌మ కుమార్తెల భాగ‌స్వాముల‌ను ఇబ్బంది పెట్ట‌డానికి పోక్సో కేసుల్ని ఉప‌యోగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఒక వేళ ఇద్ద‌రు టీనేజ‌ర్లు ప‌ర‌స్ప‌ర స‌మ్మ‌తితో శృంగారంలో పాల్గొంటే ఆ కేసు పోక్సో ప‌రిధిలోకి రాద‌ని చ‌ట్టం ఉద్దేశంలో స్ప‌ష్టంగా ఉంద‌ని గుర్తుచేసింది.

మారుతున్న స‌మాజ పోక‌డ‌ల‌ను అనుస‌రించి పోక్సో లాంటి క‌ఠిన చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాల‌కు సూచించింది. 2021లో జ‌రిగిన ఈ కేసుకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి ప‌నిచేసే వ్య‌క్తితో ఈ బాలిక‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డి ప్రేమ‌గా మారింది. దీంతో ఒక‌రోజున యువ‌కుడు, బాలిక ఒక‌రి ఇంటికి వెళ్లి ఏకాంతంగా గ‌డిపారు. వీరిని గుర్తించిన బాలిక త‌ల్లి.. త‌మ కుమార్తెను పిటిష‌న‌ర్ అప‌హ‌రించుకు వెళ్లి శారీరికంగా ఉప‌యోగించుకుంటున్నాడ‌ని 2021 జ‌న‌వ‌రి 1న పోక్సో కేసు న‌మోదు చేశారు.

Latest News