2024 లోక్‌సభ ఎన్నికలు.. ఈవీఎంలకు రూ. 1,900 కోట్లు కేటాయింపు
Union Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈవీఎంలను కొనుగోలు చేసేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు రూ. 1,900 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే పోల్ ప్యానెల్ ద్వారా ఈవీఎంల కొనుగోలుకు రూ. 1,891.78 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, […]

Union Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈవీఎంలను కొనుగోలు చేసేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు రూ. 1,900 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అయితే పోల్ ప్యానెల్ ద్వారా ఈవీఎంల కొనుగోలుకు రూ. 1,891.78 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్స్, ఓటర్ వెరిఫయబుల్ పేపర్ అడిట్ ట్రయల్ యూనిట్స్‌తో పాటు ఈవీఎంల నిర్వహణపై అనుబంధ ఖర్చులకు ఈ నిధులు ఉపయోగించాలని సూచించారు.