Nalgonda | బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ముగ్గురు మృతి

Nalgonda | విధాత‌: నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ వద్ద మిర్యాలగూడం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవ‌డంతో బస్సు అదుపు త‌ప్పి బైకును ఢీ కొట్టి, పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు బురద పొలంలో కూరుకుపోవ‌దంతో ప్రయాణికులు కష్టంగా బయటకు వచ్చారు. క్రేను సహాయంతో బస్సును […]

Nalgonda | బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ముగ్గురు మృతి

Nalgonda | విధాత‌: నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ వద్ద మిర్యాలగూడం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవ‌డంతో బస్సు అదుపు త‌ప్పి బైకును ఢీ కొట్టి, పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

బస్సు బురద పొలంలో కూరుకుపోవ‌దంతో ప్రయాణికులు కష్టంగా బయటకు వచ్చారు. క్రేను సహాయంతో బస్సును బయటకు తీశారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు