Raipur | మోదీ సభకు వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి
Raipur లారీని ఢీ కొట్టిన.. బీజేపీ కార్యకర్తల బస్సు ముగ్గురు దుర్మరణం.. మరో ఆరుగురికి గాయాలు భారీ వర్షం.. డ్రైవర్ కునికిపాటే కారణం! విధాత: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లో శుక్రవారం ప్రధాని మోదీ హాజరయ్యే సభకు అంబికాపూర్ […]

Raipur
- లారీని ఢీ కొట్టిన.. బీజేపీ కార్యకర్తల బస్సు
- ముగ్గురు దుర్మరణం.. మరో ఆరుగురికి గాయాలు
- భారీ వర్షం.. డ్రైవర్ కునికిపాటే కారణం!
విధాత: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
రాయ్‌పూర్‌లో శుక్రవారం ప్రధాని మోదీ హాజరయ్యే సభకు అంబికాపూర్ నుంచి 40 మంది బీజేపీ కార్యకర్తలతో బస్సు బయలుదేరింది. బిలాస్‌పూర్ జిల్లాలో తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌సహా ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది.
క్షతగాత్రులను బిలాస్‌పూర్ దవాఖానకు తరలించారు. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు డ్రైవర్ కునికిపాటు కారణంగా రెప్పపాటులో ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలను క్షతగాత్రుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.