Super Star Krishna | ఘట్టమనేని కుటుంబంలో ఒకే ఏడాదిలో ముగ్గురు మృతి
Super Star Krishna Family | ఘట్టమనేని కుటుంబంలో 2022 సంవత్సరం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కరిని కోల్పోతేనే కోలుకునేందుకు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే విషయమే. 2022 ఏడాది ఘట్టమనేని కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన కృష్ణ […]

Super Star Krishna Family | ఘట్టమనేని కుటుంబంలో 2022 సంవత్సరం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కరిని కోల్పోతేనే కోలుకునేందుకు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే విషయమే. 2022 ఏడాది ఘట్టమనేని కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
ఈ ఏడాది జనవరి 8వ తేదీన కృష్ణ పెద్ద కొడుకు, నటుడు రమేష్ బాబు కన్ను మూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆయన చనిపోయారు. రమేష్ బాబు చనిపోయిన తర్వాత కృష్ణ, ఇందిరా దేవీ దంపతులు బాగా కుంగిపోయారు. తమ కళ్ల ముందే కుమారుడు చనిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. ఘట్టమనేని ఇంట మరో విషాదం నెలకొంది.
సెప్టెంబర్ 28వ తేదీన కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవీ మరణించింది. ఏడాది ఆరంభంలో అన్నను, రెండు నెలల క్రితం తల్లిని కోల్పోయిన మహేశ్ బాబు తాజాగా తండ్రి కృష్ణను కోల్పోయాడు. కృష్ణ కన్నుమూయడంతో ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది. ముఖ్యంగా మహేష్ బాబుకు తీరని శోకాన్ని మిగిల్చింది.
ఇలా ఏడాది వ్యవధిలోనే మహేష్ బాబు ఇంట వరుసగా ముగ్గురు మృతి చెందడంతో.. ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో కుమారులు.. రమేశ్ బాబు, మహేశ్ బాబు, కాగా కుమార్తెలు.. పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కాగా విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు.
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ టాప్ 50 సాంగ్స్ ఇవే..