హీరో కృష్ణ లెజెండ్ నటుడు.. కేటీఆర్ ట్వీట్
Super Star Krishna | టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఇవాళ పొద్దున్నే ఓ విషాదకరమైన వార్తతో నిద్ర లేచానని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నిజమైన లెజెండ్ నటుడు అని కొనియాడారు. టాలీవుడ్‌లో చాలా మర్యాదపూర్వక నటుడు అని కేటీఆర్ ప్రశంసించారు. ఈ విషాదకర […]

Super Star Krishna | టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఇవాళ పొద్దున్నే ఓ విషాదకరమైన వార్తతో నిద్ర లేచానని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నిజమైన లెజెండ్ నటుడు అని కొనియాడారు. టాలీవుడ్‌లో చాలా మర్యాదపూర్వక నటుడు అని కేటీఆర్ ప్రశంసించారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ మరణం పట్ల ఆయన కుమారుడు హీరో మహేశ్‌కు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడం విషాదకరమే అని మహేశ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.
Woke up to the terrible news of #SuperStarKrishna Garu’s demise. Truly a legendary actor & one of the most humble stars of Telugu Film industry
Heartfelt condolences to my dear friend @urstrulyMahesh in this hour of grief. Losing both parents within a couple of months is tragic
— KTR (@KTRTRS) November 15, 2022