కాబోయే భ‌ర్త ముందే.. యువ‌తితో యువకుల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌(వీడియో)

విధాత : కాబోయే భ‌ర్త ముందే ఓ యువ‌తి ప‌ట్ల ముగ్గురు యువ‌కులు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమెను లైంగిక వేధింపుల‌కు గురి చేశారు. తన ఫియాన్సీని వ‌దిలిపెట్టాల‌ని బాధిత వ్య‌క్తి.. ఆ యువ‌కుల కాళ్ల‌పై ప‌డి ప్రాధేయ‌ప‌డిన క‌నిక‌రించ‌లేదు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో వెలుగు చూసింది. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మౌయిమా ప్రాంతానికి చెందిన ఓ యువ‌తికి పెళ్లి ఖాయ‌మైంది. దీంతో ఆమెను క‌లుసుకునేందుకు కాబోయే భ‌ర్త మౌయిమాకు వ‌చ్చాడు. వీరిద్ద‌రూ స‌ర‌దాగా బ‌య‌ట‌కు రాగా, వారిని […]

కాబోయే భ‌ర్త ముందే.. యువ‌తితో యువకుల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌(వీడియో)

విధాత : కాబోయే భ‌ర్త ముందే ఓ యువ‌తి ప‌ట్ల ముగ్గురు యువ‌కులు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమెను లైంగిక వేధింపుల‌కు గురి చేశారు. తన ఫియాన్సీని వ‌దిలిపెట్టాల‌ని బాధిత వ్య‌క్తి.. ఆ యువ‌కుల కాళ్ల‌పై ప‌డి ప్రాధేయ‌ప‌డిన క‌నిక‌రించ‌లేదు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో వెలుగు చూసింది.

ప్ర‌యాగ్‌రాజ్‌లోని మౌయిమా ప్రాంతానికి చెందిన ఓ యువ‌తికి పెళ్లి ఖాయ‌మైంది. దీంతో ఆమెను క‌లుసుకునేందుకు కాబోయే భ‌ర్త మౌయిమాకు వ‌చ్చాడు. వీరిద్ద‌రూ స‌ర‌దాగా బ‌య‌ట‌కు రాగా, వారిని ఓ ముగ్గురు యువ‌కులు అడ్డుకున్నారు. ఇక యువ‌తిని లైంగికంగా వేధించారు.

తాక‌రాని చోట తాకి ఇబ్బందుల‌కు గురి చేశారు. ముగ్గురిలో ఒక‌రు.. ఆ దృశ్యాల‌ను త‌న మొబైల్‌లో చిత్రీక‌రించాడు. త‌న ఫియాన్సీని వ‌దిలిపెట్టాల‌ని బాధిత యువ‌కుడు ఆ ముగ్గురి పాదాల‌పై ప‌డి ప్రాధేయ‌ప‌డ్డాడు. అయినా వారు క‌నిక‌రించ‌కుండా ఆమెను వేధింపుల‌కు గురి చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై అన్ని పార్టీల నాయ‌కులు తీవ్రంగా స్పందించారు. దుండ‌గుల‌ను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నేరాలు పెరిగి పోతున్నాయ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ముగ్గురు యువ‌కుల‌ను పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.