మ‌ద్యం మ‌త్తులో మూడేండ్ల బాలిక‌పై గ్యాంగ్‌రేప్‌..

Delhi | అభం శుభం తెలియ‌ని ఓ బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఆ పాప‌ను అడ‌విలోనే వ‌దిలేసి పారిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న ద‌క్షిణ ఢిల్లీ ప‌రిధిలోని ఫ‌తేపూర్ బేరి ఏరియాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌తేపూర్ బేరికి చెందిన ఓ మూడేండ్ల చిన్నారి.. త‌న ఇంటి ముందు ఆడుకుంటుంది. అయితే ఆ పాప‌ను మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం స‌మీప అట‌వీ ప్రాంతానికి […]

మ‌ద్యం మ‌త్తులో మూడేండ్ల బాలిక‌పై గ్యాంగ్‌రేప్‌..

Delhi | అభం శుభం తెలియ‌ని ఓ బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఆ పాప‌ను అడ‌విలోనే వ‌దిలేసి పారిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న ద‌క్షిణ ఢిల్లీ ప‌రిధిలోని ఫ‌తేపూర్ బేరి ఏరియాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌తేపూర్ బేరికి చెందిన ఓ మూడేండ్ల చిన్నారి.. త‌న ఇంటి ముందు ఆడుకుంటుంది. అయితే ఆ పాప‌ను మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం స‌మీప అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. త‌మ కోరిక‌లు తీర్చుకున్న త‌ర్వాత పాప‌ను అడ‌విలోనే వ‌దిలేసి పారిపోయారు.

బిడ్డ క‌నిపించ‌క‌పోయే స‌రికి త‌ల్ల‌డిల్లిన త‌ల్లి

ఉద‌యం అదృశ్య‌మైన బిడ్డ సాయంత్రం స‌మ‌యానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన త‌ల్లి త‌న బిడ్డ ఆచూకీ కోసం వెత‌క‌డం ప్రారంభించింది. మీ బిడ్డ అడ‌విలో క‌నిపించింద‌ని పొరుగింటి రాణి చెప్ప‌డంతో అక్క‌డికి త‌ల్లి వెళ్లింది. ప్ర‌యివేటు భాగాల్లో తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బిడ్డ‌ను చూసి త‌ల్లి త‌ల్ల‌డిల్లింది. ఇక బిడ్డ‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసింది.

ఫ‌తేపూర్ బేరి ఏరియాలో ఉండే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు, ఆ పాప‌ను అడ‌విలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌ను రామ్నివాస్ ప‌నికా, శ‌క్తిమాన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో వ‌ర్క‌ర్స్‌గా ప‌ని చేస్తున్నారు. వీరిద్ద‌రికి భార్య‌లు కూడా ఉన్నారు.