MLA Marri | బోనంతో వస్తే 300.. బతుకమ్మకు 200.. డ్యాన్స్ చేస్తే బీరు: స్వాగత ఏర్పాట్లకు మర్రి నజరానాలు

MLA Marri Janardhan | విధాత: నాగర్ కర్నూల్ బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పర్యటనలో స్వాగతం పలికేందుకు వచ్చే జనానికి ఆకర్షనీయ నజరానాలతో చాటింపు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మర్రికి స్వాగతం పలికే ర్యాలీలో బోనంతో వస్తే 300 రూపాయలు, బతుకమ్మతో వస్తే 200, డ్యాన్స్ చేస్తే బీరు ఇస్తామంటూ వేసిన చాటింపు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్ నేతలను కాల్చిపారేస్తానంటూ చేసిన ఎమ్మెల్యే మర్రి వ్యాఖ్యల వీడియో […]

  • By: Somu    latest    Aug 28, 2023 12:52 PM IST
MLA Marri | బోనంతో వస్తే 300.. బతుకమ్మకు 200.. డ్యాన్స్ చేస్తే బీరు: స్వాగత ఏర్పాట్లకు మర్రి నజరానాలు

MLA Marri Janardhan |

విధాత: నాగర్ కర్నూల్ బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పర్యటనలో స్వాగతం పలికేందుకు వచ్చే జనానికి ఆకర్షనీయ నజరానాలతో చాటింపు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మర్రికి స్వాగతం పలికే ర్యాలీలో బోనంతో వస్తే 300 రూపాయలు, బతుకమ్మతో వస్తే 200, డ్యాన్స్ చేస్తే బీరు ఇస్తామంటూ వేసిన చాటింపు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

అంతకుముందు కాంగ్రెస్ నేతలను కాల్చిపారేస్తానంటూ చేసిన ఎమ్మెల్యే మర్రి వ్యాఖ్యల వీడియో కూడా అదే స్థాయిలో వైరల్‌గా మారడం గమనార్హం.