సింగరేణి కార్మికులకు 32% బోనస్

విధాత : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుకను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్‌గా కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దసరా కానుకగా ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా కొనసాగిస్తుంది.

ఈ క్రమంలో 32శాతం బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 39వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవలనే 11వ వేజ్‌బోర్డు బకాయిలు 1450కోట్లను కార్మికుల ఖాతాల్లో వేశారు. తాజాగా దసరా బోనస్‌గా 700కోట్లు విడుదల చేశారు.