LIC | 35%.. పడిపోయిన LIC షేర్లు
LIC | విధాత: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఎల్ఐసీ (LIC) షేర్ల విలువ 35 శాతం తెగ్గోసుకుపోయింది. ఐపీవో సమయంలో ఒక్కో షేరు ధర రూ. 949 కాగా ఇప్పుడు అది 40 శాతం పడిపోయింది. తద్వారా మార్కెట్‌లో లిస్ట్ అయిన మే 17, 2022 నుంచి సంస్థ రూ.2.4 లక్షల కోట్లను నష్టపోయింది. ఈ ఫలితాలతో పబ్లిక్ సెక్టార్ స్టాక్‌ల్లో తొలి ఏడాది అత్యంత చెత్త ప్రదర్శన చేసిన స్టాక్‌గా ఎల్ఐసీ […]

LIC |
విధాత: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఎల్ఐసీ (LIC) షేర్ల విలువ 35 శాతం తెగ్గోసుకుపోయింది. ఐపీవో సమయంలో ఒక్కో షేరు ధర రూ. 949 కాగా ఇప్పుడు అది 40 శాతం పడిపోయింది. తద్వారా మార్కెట్‌లో లిస్ట్ అయిన మే 17, 2022 నుంచి సంస్థ రూ.2.4 లక్షల కోట్లను నష్టపోయింది. ఈ ఫలితాలతో పబ్లిక్ సెక్టార్ స్టాక్‌ల్లో తొలి ఏడాది అత్యంత చెత్త ప్రదర్శన చేసిన స్టాక్‌గా ఎల్ఐసీ నిలిచింది.
ఎంతో అనుకున్నారు కానీ
అత్యంత నమ్మకమైన బ్రాండుగా, అత్యంత విలువైన ఆస్తులను కలిగి ఉన్న సంస్థగా ఎల్ఐసీకి మంచి పేరు ఉండేది. అయితే ఐపీవోకు వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ విలువను కేవలం రూ. 6 లక్షల కోట్లుగా మదింపు చేసింది. అప్పుడే మార్కెట్‌కు దాని నిజమైన విలువ తెలిసింది. ఎల్ఐసీ విలు దాని పోటీదారులైన ప్రైవేట్ సెక్టార్ కంపెనీల విలువ కంటే చాలా తక్కువ.
హిండెన్‌బర్గ్ కుదుపు
అనంతరం సంవత్సరం తిరిగే సరికి ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటల్ రూ. 6 లక్షల కోట్ల నుంచి 3.6 లక్షల కోట్లకు దిగి వచ్చేసింది. ఇది చిన్న ఫైనాన్స్ కంపెనీలైన బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్ర బ్యాంకుల కంటే తక్కువ. మొత్తం విలువ పరంగా చూసుకుంటే ఎల్ఐసీ 13వ విలువైన ఫైనాన్షియల్ ఎంటిటీగా మారిపోయింది. ఎల్ఐసీ ఎక్కువగా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టగా… కొద్ది శాతం అదానీ గ్రూప్‌లోనూ మదుపు చేసింది. ఈ మొత్తం 0.98 శాతమే ఉంటుందని సంస్థ ప్రకటించినా హిండన్‌బర్గ్ నివేదిక సమయంలో ఎల్ ఐ సీ షేర్లు భారీగా కుదేలయ్యాయి.