Tomato | 45 రోజుల్లో 4 కోట్ల ఆదాయం! ఏపీ రైతు మురళి విజయగాధ
Tomato 22 ఎకరాల్లో టమాట సాగు విధాత: కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడు ఏపీకి చెందిన ఓ రైతు. 22 ఎకరాల్లో టమాట సాగు చేసిన ఆ రైతు అనూహ్య లాభాలు ఆర్జించాడు. ఇటీవల టమాట ధర రికార్డు స్థాయిలో పెరగడం ఆ రైతుకు వరంగా మారింది. ఏపీలోని చిత్తూరు జిల్లా కరమమండల గ్రామానికి చెందిన మరళీది ఉమ్మడి వ్యవసాయం కుటుంబం. తాతల నాటి నుంచి వారిది వ్యవసాయం కుటుంబం. తన […]
Tomato
- 22 ఎకరాల్లో టమాట సాగు
విధాత: కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడు ఏపీకి చెందిన ఓ రైతు. 22 ఎకరాల్లో టమాట సాగు చేసిన ఆ రైతు అనూహ్య లాభాలు ఆర్జించాడు. ఇటీవల టమాట ధర రికార్డు స్థాయిలో పెరగడం ఆ రైతుకు వరంగా మారింది. ఏపీలోని చిత్తూరు జిల్లా కరమమండల గ్రామానికి చెందిన మరళీది ఉమ్మడి వ్యవసాయం కుటుంబం.
తాతల నాటి నుంచి వారిది వ్యవసాయం కుటుంబం. తన చిన్నతనంలో తండ్రి టమాలు పండించి వాటిని అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఇంటి బీరువాలో భద్రంగా పెట్టడం మురళి మర్చిపోలేదు. టమాట పంట ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చని భావించాడు.
తనకు వారసత్వంగా సంక్రమించిన 12 ఎకరాలతోపాటు అదనంగా కొన్న 10 ఎకరాల్లో కూడా మురళి టమాట పంట సాగుచేసేవాడు. ఈ సారి కూడా టమాట పంట సాగుచేశాడు. ఇటీవల పంటచేతికి వచ్చింది. కర్ణాటకలోని కోలార్‌లో టమాటాకు మంచి ధర పలుకుతుందని తెలిసి 130 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి మార్కెట్‌లో మరళి టమాటాలు విక్రయించాడు. కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికే 35 సార్లు పంటను కోశాడు. మరో 15-20 పంట చేతికి వచ్చేఅవకాశం ఉన్నది.
గత ఏడాది టమాటకు సరైన ధర పలక లేదు. కూలీల ఖర్చు, ఎరువులు, ఇతర ఖర్చులు కూడా రైతు మీదే పడ్డాయి. పెట్టుబడి కూడా వెళ్లలేదు. మురళికి సుమారు రూ.1.5 కోట్ల వరకు అప్పు అయింది. ఇప్పుడు టమాట పంట అమ్మగా వచ్చిన రూ.4 కోట్లలో రూ.1.5 కోట్లు అప్పులు పోగా, ఇంకా రూ.2.5 కోట్లు మిగిలాయి.
ఆ మొత్తంలో తన గ్రామంలోనే మరో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆధునిక వ్యవసాయం చేయాలని, అందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసే పనుల్లో ఉన్నాడు టమాట రైతు మురళి.
రైతు మురళి తన పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమారుడు ఇంజినీరింగ్, కూతురును మెడిసిన్ చదివిస్తున్నాడు. భూతల్లిని నమ్ముకొని, వ్యవసాయాన్ని గౌరవించి సాగుచేస్తే ఎప్పటికీ నష్టపోము* అని రైతు మురళి తెలిపాడు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram