యూపీలో మొబైల్ టవర్ ఎత్తుకెళ్లారు!
యాభై మీటర్ల ఎత్తయిన 10 టన్నుల మొబైల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా ఉజ్జయినీ గ్రామంలో చోటుచేసుకున్నది.

- యూపీలో కౌశంబి జిల్లాలో ఘటన
- ఆలస్యంగా చోరీ వెలుగులోకి
విధాత: యాభై మీటర్ల ఎత్తయిన 10 టన్నుల మొబైల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా ఉజ్జయినీ గ్రామంలో చోటుచేసుకున్నది. ఓ మొబైల్ కంపెనీకి చెందిన టవర్‌ను ఉజ్జయినీని జనవరిలో ఏర్పాటుచేశారు. కొన్నాళ్లకు దొంగలు టవర్‌ను ముక్కలుగా విప్పి దర్జాలో వాహనంలో తరలించుకుపోయారు. టవర్‌తోపాటు ఇతర ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర వస్తువులను కూడా దోచుకెళ్లారు.
కంపెనీ టెక్నిషియన్ ఒకరు మార్చి 31న ఘటనాస్థలానికి రాగా, టవర్ కనిపించలేదు. ఈ విషయాన్నిఆయన కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కంపెనీ ప్రతినిధులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దొంగలు దోచుకెళ్లిన వస్తువుల విలువ రూ.8.5 లక్షల వరకు ఉంటుందని కంపెనీ టెక్నికల్ ప్రతినిధులు తెలిపారు. పోలీసులు గ్రామానికి వచ్చి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బీహార్‌లో ఏడాది క్రితం ఇలాగే 60 ఫీట్ల పొడవైన ఇనుప బ్రిడ్జిని దొంగలు ఎత్తుకెళ్లారు.