Mega Family | మెగా కుటుంబంలో డబుల్ ఆనందం.. పిల్లల పేర్లు ఏంటో తెలుసా?
Mega Family |మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు నెలకొన్నాయి. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకోవడం విశేషం. అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిందని తెలిపారు.
Mega Family |మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు నెలకొన్నాయి. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకోవడం విశేషం. అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారని, తల్లి–బిడ్డలు ముగ్గురూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా ఇలాంటి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
భగవంతుడి దయ, ఆంజనేయ స్వామి కృప వల్ల ఈ సంతోషకర క్షణాలు వచ్చాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. అభిమానులు కూడా ఈ వార్తను పండుగలా జరుపుకుంటుండటానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాసన ప్రసవానికి సహకరించిన అపోలో వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి రావడంతో కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపు అయింది. అభిమానులు సోషల్ మీడియాలో కవలల పేర్లపై ఆసక్తిగా చర్చించుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడు చిన్నారులతో మెగా కుటుంబం ఇప్పుడు మరింత కళకళలాడుతోంది.
అపోలో ఆసుపత్రిలో ప్రసవానికి సహకరించిన సీనియర్ గైనకాలజిస్ట్‌కు చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్లీంకార జననం సమయంలో కూడా ఆమె సేవలు అందించారని, ఈసారి కూడా ఎంతో శ్రద్ధగా చూసుకున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు ఇప్పటికే క్లీంకారా అనే కుమార్తె ఉంది. ఇప్పుడు క్లీంకారాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. క్లీంకారకు తమ్ముడు- చెల్లి సరే కానీ, ఆ ఇద్దరి పేర్లేమి? అంటూ మెగాభిమానులు సోషల్ మీడియాల్లో చర్చించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా కూడా మారింది.
ఇక రామ్ చరణ్ కెరీర్ పరంగా కూడా మంచి దశలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండగా, ముందున్న ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు వృత్తిపరమైన విజయాలు, మరోవైపు కుటుంబంలో కవలల జననం—ఈ రెండు కలిసివచ్చి చరణ్ జీవితంలో అరుదైన ఆనంద క్షణాలను తీసుకొచ్చాయి. తండ్రిగా ఇప్పుడు ట్రిపుల్ సంతోషాన్ని అనుభవిస్తున్న చరణ్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram