TVS Showroom | బైకుల షోరూంలో అగ్నిప్రమాదం

TVS Showroom | విధాత, విజయవాడ: నగరంలోని స్టెల్లా కాలేజీ వద్ద ఉన్న టీవీఎస్ షోరూం లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజాము నుంచి షోరూమ్ తగలబడగా, మధ్యాహ్నం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. #WATCH | Motorbikes gutted in fire at a bike showroom in Vijayawada, Andhra Pradesh pic.twitter.com/aO14raASOk — ANI (@ANI) August 24, 2023 అప్పటికే […]

  • By: Somu |    latest |    Published on : Aug 24, 2023 1:11 AM IST
TVS Showroom | బైకుల షోరూంలో అగ్నిప్రమాదం

TVS Showroom | విధాత, విజయవాడ: నగరంలోని స్టెల్లా కాలేజీ వద్ద ఉన్న టీవీఎస్ షోరూం లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజాము నుంచి షోరూమ్ తగలబడగా, మధ్యాహ్నం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అప్పటికే టీవీఎస్ షో రూమ్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో షోరూమ్ లో ఉన్న ఎలెక్ట్రిక్ ,పెట్రోల్ టూవీలర్ వాహనాలు బుగ్గిపాలయ్యాయి. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఘటనకు కారణాలపై ఆరా తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు