Heat Wave | యూపీలో భానుడి భగభగలు.. 72 గంటల్లో 54 మంది మృతి
Heat Wave | ఉత్తరప్రదేశ్‌లో భానుడి భగభగలకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడిమిని, వడగాల్పుల తీవ్రతను తట్టుకోలేక 72 గంటల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో గత మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదు అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎండలు దంచికొట్టడంతో పాటు వడగాల్పులతో అట్టుడికి పోతోంది. వడగాల్పులకు తట్టుకోలేక […]
Heat Wave | ఉత్తరప్రదేశ్‌లో భానుడి భగభగలకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడిమిని, వడగాల్పుల తీవ్రతను తట్టుకోలేక 72 గంటల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో గత మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదు అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎండలు దంచికొట్టడంతో పాటు వడగాల్పులతో అట్టుడికి పోతోంది.
వడగాల్పులకు తట్టుకోలేక వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు 54 మంది చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 400 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఆస్పత్రుల్లో చేరుతున్న వారంతా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి ఎక్కువ అవుతుండటంతో వైద్య సిబ్బంంది అప్రమత్తమై, అందరికీ వైద్యం అందించేందుకు యత్నిస్తున్నారు.
జూన్ 15వ తేదీన 23 మంది, ఆ మరుసటి రోజు మరో 20 మంది, నిన్న 11 మంది చనిపోయినట్లు బాలియా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్‌కే యాదవ్ మీడియాకు వెల్లడించారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram