భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు పిట్ట‌ల్లా రాలిపోతున్న జ‌నాలు.. 2 గంట‌ల్లో 16 మంది మృతి

దేశ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో 50 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. బీహార్‌లో నిన్న 48.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. దీంతో ఎండ‌ల‌ను త‌ట్టుకోలేక జ‌నాలు పిట్టల్లా రాలిపోతున్నారు.

భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు పిట్ట‌ల్లా రాలిపోతున్న జ‌నాలు.. 2 గంట‌ల్లో 16 మంది మృతి

పాట్నా : దేశ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో 50 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. బీహార్‌లో నిన్న 48.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. దీంతో ఎండ‌ల‌ను త‌ట్టుకోలేక జ‌నాలు పిట్టల్లా రాలిపోతున్నారు.

బీహార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో కేవ‌లం రెండు గంట‌ల్లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వ‌డ‌దెబ్బ కార‌ణంతోనే ఆస్ప‌త్రుల్లో చేరార‌ని వైద్యులు తెలిపారు. మ‌రో 35 మందికి చికిత్స‌ అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. వ‌డ‌దెబ్బ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారిని దృష్టిలో ఉంచుకుని మ‌రిన్ని కూల‌ర్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. మెడిసిన్స్, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచామ‌న్నారు.

ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, అంగ‌న్‌వాడీ సెంట‌ర్లతో పాటు అన్ని ర‌కాల కోచింగ్ సెంట‌ర్ల‌ను జూన్ 8వ తేదీ వ‌ర‌కు మూసి ఉంచాల‌ని అధికారులు ఆదేశాలు జారీచేశారు. భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో పిల్ల‌ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. షేక్‌పురా జిల్లాలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 16 మంది విద్యార్థినులు వ‌డ‌దెబ్బ‌కు గుర‌య్యారు. వీరిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక‌పోవ‌డంతో టూ వీల‌ర్స్, ఈ రిక్షాల్లో ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. బెగుస‌రాయిలోనూ విద్యార్థులు సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు.