Rose Day | రోజ్ డే నాడు భర్తకు సర్‌ప్రైజ్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు షాకిచ్చిన పోలీసులు
రోజ్ డే (Rose Day) సందర్భంగా తన భర్తకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బీహార్‌కు చెందిన కంచన్ దేవి (Kanchan Devi) అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (social media influencer) చిక్కుల్లో పడింది. ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Rose Day | వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14నే అయినా.. వారం రోజుల ముందు నుంచే సంబరాలు మొదలవుతాయి. రోజ్‌డే (Rose Day)తో మొదలయ్యే ఈ సంబరాలు.. ప్రపోజ్ డే, చాకొలెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. చివరికి వాలెంటైన్స్‌డేతో ముగుస్తాయి. ఈ ఏడు రోజులూ పెళ్లైన జంటలు, ప్రేమ జంటలు సంబరాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన వారికి సర్‌ప్రైజ్ (surprise)లు ఇస్తుంటారు. అలా తన భర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చి ఓ మహిళ చిక్కుల్లో పడింది.
ఫిబ్రవరి 7న రోజ్ డే సందర్భంగా బీహార్ (Bihar)లోని ముంగేర్ జిల్లాకు చెందిన కాంచన్ దేవి (Kanchan Devi) అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (social media influencer).. తన భర్తకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే ఓ చోట కూర్చోబెట్టి గులాబీ పూలు ఇచ్చి రోజ్‌డే విషెష్ చెప్పింది. ఆ తర్వాత ఆయనకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా మద్యం బాటిల్‌ను బహుమతిగా అందించింది. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇదికాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. ఇందులో తప్పేముంది అంటారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్..
మరో ఫొటో ప్రత్యక్షం..
బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వీడియోపై పోలీసుల దృష్టి పడింది మరి. మద్యం వీడియో వైరల్ అవుతుండగానే.. కాంచన్ దేవికి సంబంధించిన మరో ఫోటో నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో ఆమె చేతిలో తుపాకీ పట్టుకుని స్టైల్‌గా ఫోజులిచ్చిన ఫొటో బయటకు వచ్చింది. ఇది ఈ కేసుకు మరింత ఆజ్యం పోసినట్లైంది. దీనిపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం, ఆయుధాన్ని బహిరంగంగా ప్రదర్శించడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చిక్కులు తెచ్చిన సర్‌ప్రైజ్‌ప్లాన్..
అంతేకాదు పోలీసులు కాంచన్ దేవి ఇంటిపై రైడ్ చేసింది. విచారణలో ఆమె ఫొటోలో ఉన్న పిస్టల్ దీన్‌దయాళల్ చౌక్‌కు చెందిన విశాల్ కుమార్ అనే వ్యక్తిదిగా తేలింది. దీనికి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అయితే, ఆ గన్‌కు లైసెన్స్ ఉన్నప్పటికీ.. సంబంధం లేని వ్యక్తులకు ఆయుధాన్ని ఇవ్వడం చట్టరీత్యా నేరం. అంతేకాదు దాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించడమూ నేరమే. ఈ మేరకు పోలీసులు పిస్టల్ యజమానిపై కూడా చర్యలు చేపట్టారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాగా, కాంచన్ దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. రోజ్‌డేని అందమైన జ్ఞాపకంలా మార్చుకోవాలనుకున్న ఆమెకు ఈ ఘటన పెద్ద షాకిచ్చినట్లైంది.
ఇవి కూడా చదవండి :
Congress clean sweep Nalgonda | ఉమ్మడి నల్లగొండ పుర పోరులో కాంగ్రెస్ పార్టీదే పైచేయి !
KTR| కొత్తగూడెంలో మద్దతిస్తాం.. తీసుకోండి : సీపీఐకి కేటీఆర్ బంపర్ ఆఫర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram