Nepal | నేపాల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు భార‌తీయులు మృతి

మ‌రో 19 మందికి గాయాలు.. మృతుల‌ది రాజ‌స్థాన్ రాష్ట్రం డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో బ‌స్సుకు ప్ర‌మాదం Nepal | విధాత‌: నేపాల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు మ‌ర‌ణించారు. మృతుల్లో ఆరుగురు భార‌తీయ యాత్రికులు ఉన్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. వారంతా భార‌త్‌లోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మ‌రొక‌రు నేపాల్ పౌరుడు […]

Nepal | నేపాల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు భార‌తీయులు మృతి
  • మ‌రో 19 మందికి గాయాలు.. మృతుల‌ది రాజ‌స్థాన్ రాష్ట్రం
  • డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో బ‌స్సుకు ప్ర‌మాదం

Nepal | విధాత‌: నేపాల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు మ‌ర‌ణించారు.

మృతుల్లో ఆరుగురు భార‌తీయ యాత్రికులు ఉన్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. వారంతా భార‌త్‌లోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మ‌రొక‌రు నేపాల్ పౌరుడు ఉన్న‌ట్టు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాట్మండు నుంచి జనక్‌పూర్‌కు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బ‌స్సు బారాలోని చురియమై సమీపంలో ప్రమాదానికి గురైంది.

డ్రైవ‌ర్ బ‌స్సుపై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో బోల్తా ప‌డి 50 మీట‌ర్ల దూరంలో ప‌డిపోయింది. ఈ ప్రమాద స‌మ‌యంలో బ‌స్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్ సహా మొత్తం 27 మంది ఉన్నారు.